ప్రత్యామ్నాయ కేవైసీ దిశగా టెల్కోలు

Updated By ManamThu, 11/08/2018 - 23:03
BSNL

BSNLన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగాం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కొత్త కనెక్షన్‌లు ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ డిజిటల్ కేవైసీని ప్రవేశ పెట్టింది. నూతన కస్టమర్లకు ప్రత్యామ్నయ కేవైసీ ద్వారా కనెక్షన్ ఇవ్వడం ప్రారంభించినట్లు డిపార్ట్‌మెంట్  ఆఫ్ టెలికాంకు  బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ పద్దతిని అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చినటుల ఆయన తెలిపారు. కాగా, ఇటీవల సప్రీం కోరుట టెలికాం కంపెనీలు ఆధార్‌తో తమ కస్టమర్లకు డిజిటల్ కేవైసీని చేయోద్దని ప్రకటించి విషయం తెలిసిందే. దీనిపై స్వందిస్తూ ఇప్పటికే కొత్త పద్దతిలో కేవైసీని ప్రారంభించాయి.  ఈ వారం మొదట్లో ఆధార్ ఈ-వెరిఫికేషన్ స్థానంలో ప్రత్యామ్నాయ కేవైసీని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేటు రంగ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తెలిపాయి. అయితే ఎయిర్‌టెల్ కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లు ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వెస్ట్, ఈస్‌లలో కొత్త కేవైసీని అందుబాలోకి తీసుకురాగా, త్వరలోనే అన్ని సర్కిళ్లలో ఈ పద్దతిని ప్రవేశపెట్ట నున్నట్లు ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా కూడా కొత్త కేవైసీని దేశం మొత్తం అమలు చేయనున్నట్లు ప్రకటిం చింది. డిపార్ట్‌మెంట ఆఫ్ టెలికాం సూచన ల మేరకు డిజిటల్ కేవైసీని ప్రారంభి స్తామని పేర్కొంది. ఇక జియో త్వరలోనే కొత్త కేవైసీని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఆధార్‌తో కేవైసీని నిర్వహించేందుకు నవంబర్ 20 నాటికే సమయం ఉండటంతో కొత్త డిజిటల్ కేవైసీకి మరికొంత సమయం కావాలని డిపార్ట్‌మెంట్ ఆప్ టెలికాం(డీఓటీ)ను టెలికాం ఆపరేటర్లు కోరారు. దీనిపై స్పందించిన డీఓటీ గడువును పెంచడం తమ పరిధిలోకి రాదని తాము సుప్రీం ఆదేశాలు పాటిస్తామని పేర్కొంది. గడువు కావాలంటే యూఐడీఏఐని సంప్రదిచాలని సూచించింది.

Tags
English Title
Telcos towards alternative kiosise
Related News