మళ్లీ టీఆర్ఎస్‌వైపే ఓటర్ల మొగ్గు!

 Telangana voters, favour of TRS, Exit poll survey
  • తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్.. రిపబ్లిక్, టైమ్స్ నౌ సర్వే ఫలితాలు

  • టీఆర్ఎస్‌కు 66 సీట్లు.. కాంగ్రెస్‌కు 37..  బీజేపీ 7.. ఇతరులు 9 

న్యూఢిల్లీ: తెలంగాణ 119 అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో జాతీయ మీడియా చానెల్ టైమ్స్ నౌ, సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి కూడా తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్‌వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టు టైమ్స్ నౌ తమ సర్వేలో వెల్లడించింది. టీఆర్ఎస్ 66 స్థానాలు, ప్రజాకూటమి కాంగ్రెస్‌కు 37 స్థానాలు, బీజేపీ 7 స్థానాలు, ఎంఐఎం సహా ఇతరులు 9 స్థానాలు గెలిచే అవకాశం ఉందని జాతీయ చానెళ్లు తమ ఫలితాల్లో వెల్లడించాయి.

రిపబ్లిక్ చానెల్ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తెలంగాణకే ఓటర్లు మొగ్గు చూపినట్టు వెల్లడించింది. టీఆర్ఎస్ 50 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, ప్రజాకూటమి 38 స్థానాలు నుంచి 52 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే బీజేపీ 4 నుంచి 7 స్థానాల్లో, ఎంఐఎం ఇతర పార్టీలు కలిపి మొత్తం 10 నుంచి 17 స్థానాల్లో స్వత్రంత్య అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మరోవైపు తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను జాతీయ మీడియా చానెళ్లు విడుదల చేశాయి. 

సంబంధిత వార్తలు