ఆ రోజు రాత్రి నరకం అనుభవించాం: నామా

Updated By ManamFri, 09/14/2018 - 14:27
Nama nageswara rao
  • తెలంగాణ సరిహద్దులోనే అరెస్ట్ చేశారు

  • ఒకే గదిలో 80మందిని బంధించారు

  • తెలంగాణ ప్రజల కోసమే ఆందోళన చేశాం

  • రాష్ట్రం ఎడారిగా మారకూడదనే

Nama nageswara rao

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయడాన్ని తెలంగాణ టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసమే అప్పుడు తాము ఆందోళన చేశామన్నారు. 

మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ...‘బీజేపీ కావాలనే కుట్రలు చేస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సమయంలో బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినప్పడు .... తెలంగాణ సరిహద్దులోనే మమ్మల్ని అరెస్ట్ చేశారు.  బాబ్లీ చూపించబోం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా మహిళా నేతల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు.

ఒకే గదిలో 80మంది నేతలను బంధించారు. ఆ రోజు రాత్రి అక్కడ నరకం అనుభవించాం. మంచినీళ్లు కాదుకదా... టాయ్‌లెట్లు లేవు. మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎనిమిదేళ్ల తర్వాత వారెంట్ జారీ చేయడం దారుణం. బీజేపీ కుట్రకు ఇది నిదర్శనం. బాబ్లీ కేసులో నాకు ఇంతవరకూ ఒక్క నోటీసు కూడా రాలేదు’ అని అన్నారు.

కేసులకు భయపడం: పెద్దిరెడ్డి
నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌పై న్యాయపరంగా ఎదుర్కొంటామని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా వారెంట్‌ను రద్దు చేసి, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  బీజేపీ ప్రభుత్వం చొరవతోనే చంద్రబాబుకు వారెంట్ జారీ చేశారని అన్నారు. మహాకూటమికి భయపడి కేసీఆర్, మోదీ కుమ్మక్కు అయ్యారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అలాగే గత ఎనిమిదేళ్లలో ఎలాంటి నోటీసులు పంపలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్పందించాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

English Title
Telangana TDP leaders demanding BJP to arrest Chandrababu naidu
Related News