తెలంగాణ రాజకీయాలు - పౌర సమాజం

Updated By ManamWed, 05/16/2018 - 01:17
image

imageకోదండరాం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాను ఒక రాజ కీయ పార్టీ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నందున జాయింట్ యాక్షన్ కమిటీలో కొనసాగడం భావ్యం కాదని భావించి ఆ పనిచేశాడు. రాజకీయ విశ్లేషణలో జె.ఎ.సి.ల స్థానమేమిటి? తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఇవి నిర్వహించవలసిన పాత్ర ఏమిటి? అనే సంశయాలు, సందేహాలు చాలానే వచ్చాయి. గతంలో నేను రాసిన వ్యాసాలలో తెలంగాణ ఉద్యమం మూడు పాయలలో జరిగిందని పేర్కొన్నాను. ఒకటి, పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆశించిన భౌగోళిక తెలంగాణ; రెండు, కొంత మెరుగైన తెలం గాణ రాజ్య వ్యవస్థ, ప్రజాస్వామిక పాలన, తెలంగాణ ప్రాంత ప్రజల కీలక సమస్యల పరిష్కారం, దీనితో బాటు చట్టబద్ద పాలన పోలీసు నిర్బంధం ముగింపు, రాజకీయ పార్టీలు మరింత ప్రజలకు జవాబుదారీగా ఉండడం లాంటి ఆకాంక్షలు; మూడు, విప్లవ రాజకీ యాలు ఆశిస్తున్న, పోరాడుతున్న ప్రజాస్వామిక తెలం గాణ. పార్లమెంటరీ రాజకీయాలు విప్లవ రాజకీ యాలు సారాంశంలో రాజకీయ ప్రక్రియలే, కాని మధ్యేమార్గంగా ఉన్న జె.ఎ.సిలు, సామాజిక ఉద్య మాలు ఈ రాజకీయాలకు బయట ఉండి, రాజ్యం మీద నిరంతరంగా ఒత్తిడి పెట్టడమే కాక ఒక ప్రజా స్వామిక గొంతుకను వినిపించడం. కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ కోవకు చెందిన సంస్థే. కోదండరాంను రాజకీయ జె.ఎ.సి.కి చైర్మన్‌గా నియమించడంతో పౌర సమాజ సంస్థలకు రాజకీయాలకు మధ్య సరిహద్దు రేఖ కొంత వరకు అస్పష్టతకు గురైంది. రాజకీయ పార్టీలు ఆయన నాయకత్వాన్ని తాత్కాలికంగానైనా అంగీకరిం చడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క ప్రత్యేకత. ఇదొక ప్రయోగం కూడా. ఆయన నాయక త్వాన్ని అంగీకరించడంలో రాజకీయ పార్టీల స్వప్ర యోజనం చాలా ఉంది. ఆయన విద్యారంగం నుంచి రావడం వలన వ్యక్తిగతంగా సౌమ్యుడు, సంయ మనం పాటించేవాడు కావడం వలన, ఆయన వల్ల ఏ పార్టీకి ప్రత్యక్షంగా ప్రమాదం లేదు అని భావించడం వలన ఆ పాత్రను ఆయనకు అప్పచెప్పారు. మొదటి నుంచి ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నామని భావిం చిన తెరాస పార్టీకి కోదండరాం పట్ల ద్వంద్వ భావనే మొదటి నుంచి ఉంది. అంటే పౌర సమాజ ప్రతిని ధిని రాజకీయ ఉద్యమంలోకి తేవడం వలన తమకు సమస్యలుంటాయని ముందే గ్రహించి ఆయనకు పరి మితమైన మద్దతివ్వడమేకాక ఆయనను కొన్ని పరి మితులలోనే ఉంచాలని ఆ పార్టీ నిర్ణయించుకొంది. 

ఈ రాజకీయ చట్రంలో కోదండరాం టి.ఆర్. ఎస్.కు కొరకరాని కొయ్యలా మారాడు. మొత్తం ఉద్య మం తమ చేతిలోనే ఉండాలని భావించిన పార్టీ ఉద్యమ దశను దిశను నిర్ణయించాలని భావించడం వలన ఎవ్వరము స్వతంత్ర నిర్ణయం తీసుకున్నా పార్టీకి చిరాకుగానే ఉండేది. ఒకవైపు కోదండరాంను బంగారంలాంటి మనిషి అని పొగడుతూ మరోవైపు ఈ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం ఎలా అనేది వాళ్ళ సమస్య. ముఖ్యంగా ఉద్యమం చల్లబడు తున్న ది అని భావించినప్పుడల్లా ఒకవైపు విద్యార్థులు, మరోవైపు జె.ఎ.సి.లు నిప్పును చల్లారనివ్వలేదు. మొ త్తం ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకే వదిలేస్తే గతంలో అంటే 1969 ఉద్యమాన్ని తెలంగాణ ప్రజా సమితి ఎలా నిండా ముంచిందో ఆ అనుభవం తెలంగాణ కుంది. జె.ఎ.సిలో చాలా వినూతన ప్రయోగాలు చేశారు. ప్రతి ప్రయోగంలో ప్రజలు పెద్దసంఖ్యలో ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ జరిగిన రెండు ప్రయోగాలు మిలియన్ మార్చ్, సాగర హారం. ఈ రెండు సభల పట్ల టి.ఆర్.ఎస్.కు ఎక్కువగా అంగీకారం లేదు. తీరా పిలుపు ఇచ్చాక మిలియన్ మార్చ్‌కు, సాగర హారానికి తమ పరిమితిలో మద్దతు ఇవ్వక తప్ప లేదు. తాముకాక ఇతరులు ఇలా ప్రజాసమీకరణ చేయడం వల్ల సమస్యలుంటాయనేది టి.ఆర్.ఎస్. అవగాహన. 

ఈ రాజకీయ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. సహజంగానే ఎన్నికల రాజకీ యాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ తెచ్చినామన్న తెరాసకు, తెలంగాణ ఇచ్చినామన్న కాంగ్రెస్‌కు మధ్య పోటీ. ఈ పోటీలో జె.ఎ.సిలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడం టీఆర్‌ఎస్ పార్టీకి చాలా ఆగ్రహాన్ని కలిగించింది. కానీ, పౌరసమాజంలో స్వతంత్రంగా పనిచేసిన సంస్థలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడం సమాజానికి అవసరం అని జె.ఎ.సిలో భావించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విధానపరంగా తీసుకుంటున్న నిర్ణయాలని ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే గొంతులు ప్రజాస్వామిక అవసరం. అందుకే నా దృష్టిలో జె.ఎ.సిలో అలా గే కోదండరాం తీసుకున్న నిర్ణయాలు చాలా బాధ్యతతో తీసుకున్నవే. ఈ ఆగ్రహంతో టి.ఆర్.ఎస్ పార్టీ కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి కూడా కోదండరాంను చివరి దాకా ఆహ్వానించలేదు. 

తెలంగాణలో మూడవ పాయలో గత ఐదు దశాబ్దాలుగా విప్లవ రాజకీయాలు మౌలిక మార్పు కోసం పోరాడుతున్నాయి. అసాధారణైవెున త్యాగాలు చేశా యి. ఈ రాజకీయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అసంఖ్యాకైమెన ప్రజాస్వామిక గొంతులను ప్రభావితం చేశాయి. ఇవాళ అధికార పార్టీలో ఉన్న కొందరు శాసనసభ్యుల దగ్గరి నుంచి విద్యారంగంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుంచి, జర్నలిజంలో ప్రతిష్ఠ కలిగిన ఎడిటర్ల నుంచి, ఉద్యోగ, కార్మిక సంఘాల దాక అన్ని రంగాలను ప్రభావితం చేశారు. విప్లవోద్యమం ఏం సాధించింది అని అంటే జవాబు కష్టమే కావచ్చుకానీ, అది తెలంగాణకు వేలాది ప్రజాస్వామ్య గొంతులను అందించింది. ఈ ప్రభావం తెలంగాణ పౌరసమాజం మీద చాలా లోతైన ముద్ర వేసింది. విప్లవోద్యమాన్ని ఆయుధం పేరు చెప్పి అణచివేసే క్రమంలో రాజ్యం అమానవీయంగా మారి, అణచివేతను విస్తరిస్తూ పౌరసమాజం మీదే దాడిచేయడం ఉమ్మడి రాష్ట్రం ప్రారంభించింది. దాంట్లో భాగంగానే పౌరహక్కుల నాయకులను చంపడం, ఉపాధ్యాయులను చంపడం, కొందరు అమాయకులను చంపే క్రమంలో ఎన్‌కౌంటర్ అంటూ నిలువునా ప్రాణం తీస్తాం అనే అర్థాన్ని సంతరించుకొంది. ఈ నేపథ్యమే కావచ్చు విప్లవోద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించింది. సమర్ధిస్త్తూనే ప్రజాస్వామ్య తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది. 

అ సందర్భం వల్లే తెరాస ప్రభుత్వం మూడు సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఒకటి- తెలంగాణలో ైచెతన్యాన్ని, రెండు- తెలంగాణ ఆకాంక్షలు, మూడు- విస్తృత ప్రజాస్వామ్య శక్తులు. అధికారంలోకి రావడంతోనే సభల మీద, సమావేశాల మీద, ఊరేగింపుల మీద దాదాపు నిషేధం విధించింది. విప్లవ పార్టీ సానుభూతి సంస్థలపైన, అనుబంధ సంస్థలపైన ప్రారంభమైన నిర్బంధం విస్తరిస్తూ కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టే వరకు వచ్చింది. అంటే జె.ఎ.సిలో విప్లవ రాజకీయం కాకున్నా ప్రజాస్వామ్య గొంతులు ఎన్నైడెనా తమకు సవాలేనని భావించి నిర్బంధాన్ని పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూనే పరిస్థితి ఇలా ఉంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ విద్యావంతుల వేదిక మీద ముఖ్యంగా కోదండరాం మీద మొత్తం క్యాబినెట్ మంత్రులు విరుచుకుపడ్డారు. ఇక ఆయనను ఏమాత్రం కదలకుండా కట్టడి చేయడం ప్రారంభించారు. జె.ఎ.సి సభ్యులకు ఏం పాలుపోని పరిస్థితి కల్పించారు. ఇక రాజకీయపార్టీగా మారితే తప్ప వేరే గత్యంతరం లేదు అనే పరిస్థితి కల్పించారు. 

ఈ అనుభవాన్ని ఎలా విశ్లేషించాలి అనేది ఒక సమస్యే. రాజకీయ పార్టీ అంటే ఆ రాజకీయాల ఆటలో నియమాలే వేరు. ఎన్నికల రాజకీయాలు పూర్తిగా భ్రష్ఠుపట్టడం వలన ఎన్నికల ద్వారానే ఫాసి జం తన శక్తిని పెంచుకుంటున్నది. కర్ణాటక ఎన్నికల లో భాష స్థాయి పూర్తిగా దిగజారిపోయింది. దేశ ప్రధానమంత్రి వాస్తవాలను వక్రీకరించడం వలన ఆయన పదవికే గౌరవం తగ్గింది. ఈ పద్మవ్యూహం లో తెలంగాణ జన సమితి ఎలా నిలబడుతుంది అన్నది ప్రశ్న. తెలంగాణ చైతన్యం ఒక కొత్త ప్రయోగాన్నేమయినా చేస్తుందా... తెలియదు. ఒక్క మాట మాత్రం నిజం. ఇవాళ దేశ రాష్ట్ర రాజకీయాలు పౌరసమాజాన్ని ధ్వంసం చేస్తున్నాయి. పౌర సమాజం రాజ్యానికంటే బలైవెునదని, సామాజిక ఉద్యమాలు, పోరాటాలు ఎన్నికలకు ప్రత్యామ్నాయమని, ప్రజాస్వామ్యం అలాగే రక్షంచబడుతుందనేది ఒక సామాజిక సత్యం. అయితే, ఎన్నికల రాజకీయాలు పౌరసమాజ చైతన్యం, విప్లవ పోరాటాల మధ్య లంకె ఏమైనా సాధ్యమా అన్నది చరిత్ర విసురుతున్న సవాలు. తెలంగాణ ఒక ప్రయోగశాల. రానున్న కాలంలో ఎలాంటి ప్రయోగం చేయనున్నదో వేచి చూడవలసిందే. అంటే విస్తృత ప్రజాస్వామ్య చైతన్యం ఎన్నికల రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపుతాయా లేక ఎన్నికలు చైతన్యాన్ని నిర్వీర్యం చేస్తుందన్నది ఒక ప్రశ్న. ఐతే ఈ రెండింటి మధ్య పౌరసమాజం మరింత సజీవంగా నూతన విలువలకు దారి ఏైమెనా వేస్తుందా అన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సవాలు.

image

 

 

English Title
Telangana politics - civil society
Related News