13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

telangana elections 2018:  polling end in 13 Left Wing Extremism affected constituencies

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.  తెలంగాణాలోని  సమస్యాత్మక నియోజకవర్గాలైన సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తయింది. ఇక మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం అయిదు గంటల వరకూ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 54 శాతం పోలింగ్ నమోదు అయింది.  సాయంత్రం వరకు అదేస్థాయిలో పోలింగ్ జరిగితే దాదాపు 80 శాతం పోల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే హైదారాబాద్‌లో 38.68 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత వార్తలు