హైదరాబాద్‌లో మందకొడిగా పోలింగ్

Telangana Elections 2018: Lowest polling in Hyderabad city

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడానికి కేవలం గంట మాత్రమే సమయం మిగిలి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం భారీగా నమోదు అవుతున్నా... హైదరాబాద్‌లో మాత్రం మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటలకు కేవలం 38 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు వెలవెలబోతున్నాయి. చాలాచోట్ల ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇక నాంపల్లితో పాటు చాంద్రాయగుట్టలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది.  చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక తెలంగాణవ్యాప్తంగా 56 శాతం పోలింగ్ జరిగింది.

సంబంధిత వార్తలు