బావా, బామ్మర్ది ఆత్మీయ ఆలింగనం

Telangana Elections 2018: KTR Congrats to Harish rao

హైదరాబాద్:  సిద్ధిపేట‌లో శుక్రవారం ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుందిన. బావా, బామ్మర్ది కలుసుకుని నవ్వులు చిందించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సిద్ధిపేటలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ
ప‌ల‌క‌రించుకుని, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్.. హైదరాబాద్‌లో ఓటు వేసిన అనంతరం తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల బయల్దేరారు.

మరోవైపు హరీశ్ రావు సిద్దిపేటలో పోలింగ్ సరళి తెలుసుకునేందుకు గ్రామాల్లో స్వయంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి వాహనాలు గుర్రాల గొంది గ్రామం వ‌ద్ద ఎదురయ్యారు. దీంతో కేటీఆర్, హరీశ్ వాహనాలు దిగి పలకరించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ...‘బావా కంగ్రాట్స్ నీకు లక్ష మెజార్టీ ఖాయం’ అని సరదాగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నీ మెజార్టీలో సగం అయినా తెచ్చుకుంటా...సిరిసిల్ల పోతున్నా అంటూ కేటీఆర్ తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు