తెలంగాణలో ముగిసిన పోలింగ్

telangana elections 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. ఈ నెల 11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పట్టణాలలో తక్కువగా పోలింగ్ శాతం నమోదు కాగా, పల్లెల్లో మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో 53 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యధికంగా సికింద్రాబాద్ లో 56 శాతం నమోదైంది.

119 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగగా, ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కి తరలించనున్నారు. ఈవీఎంలలో నేతల భవిష్యత్ నిక్షిప్తం కాగా, గెలుపుపై నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఇక మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 4 గంటలకు ముగిసింది.

సంబంధిత వార్తలు