టీ-వ్యాలెట్ ఆవిష్కరణ

Updated By ManamFri, 08/10/2018 - 02:22
Patnam is Mahender Reddy
  • ఆర్టీసీలో పూర్తి స్థాయి ఐటీ సేవల వినియోగం

  • కొత్తగా వరంగల్ - పుణె సర్వీస్: రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

Patnam is Mahender Reddyహైదరాబాద్: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను పూర్తి స్థాయిలో వినియోగిస్తుందని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో టీఎస్ ఆర్టీసీ టీ- వ్యాలెట్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ, ఈడీ పురుషోత్తం నాయక్‌తో కలిసి ఆయ న ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం టీ-వ్యాలె ట్‌కు అనుసంధానంగా టీఎస్ ఆర్టీసీని రూపకల్పన చేసిం దని చెప్పారు. టీ - వ్యాలెట్  ఆవిష్కరణతో ఆర్టీసీలో విమానయాన ప్రయాణికుల తరహా ముందుగానే తమ సీట్లను ఇంటి వద్ద నుండే  రిజర్వ్ చేసుకునే సదుపాయాలు ఇక మీదట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం రోజు 13 వేల సీట్లు ఆన్ లైన్ సదుపాయాలకు అవకాశం ఉండగా రోజు 6 వేలు రిజర్వేషన్ ఆన్ లైన్ అయ్యేవని ఇలా రూ.62 లక్షల ఆదాయం ఆర్టీసీకి వస్తుందని తెలిపారు. టీ-వ్యాలెట్ తో పూర్తి స్థాయిలో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని, టీఎస్ ఆర్టీసీకి చెందిన 900 అంతర్ రాష్ట్ర సర్వీసుల తాలూకు 1770 దూర ప్రాంతాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంద న్నారు. టీ- వ్యాలెట్‌తో రిజర్వేషన్ కనీసం 30 రోజుల ముందే ఆన్ లైన్ లో చేసుకోవచ్చని, ఇది ఎస్‌ఎంఎస్ ద్వారా నిర్ధారణ అవుతుందని వివరించారు. పొరుగు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, గోవా, ఏపీలకు సర్వీసులు నడుపుతున్నామని వీటిలో ఏపీకి 700 సర్వీసులు నడుస్తుండగా త్వరలో మరో 100 సర్వీసులు పెంచుతామని వెల్లడించారు. వరంగల్, నిజామాబాద్ లకు నడుపుతున్న వజ్ర సర్వీస్ సేవలు బాగున్నాయని, ఆన్ లైన్ సేవలు వీటికి మరింత ఉపయోగపడుతాయన్నారు. త్వరలో వరంగల్ - పూనా అంతర్ రాష్ట్ర కొత్త సర్వీసును ప్రారంభిస్తామని, ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ రవాణా శాఖ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రూపొందించి సుమారు 20 లక్షల మందికి సౌకర్యంగా ఉన్న ఎం - వ్యాలెట్ తరహాలో ఆర్టీసీ టీ- వ్యాలెట్ పనితీరు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టపరుస్తామని పేర్కొన్నారు. నష్టాలలో ఉన్నా ఆర్టీసీ పేదలకు సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం సంస్థను సామాజిక కోణంలో ఆదుకుంటుందన్నారు. ఆర్టీసీ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ పురుషోత్తం నాయక్, వోయడ్సీటు సుధాకర్ రెడ్డి, కృష్ణకాంత్ ఆర్టీసీ ఐటీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

English Title
Tea-Valelet Discovery
Related News