కేకే మాకు మద్దతివ్వండి..: టీడీపీ ఎంపీలు

Updated By ManamSun, 07/15/2018 - 20:18
TDP MPS Mets TRS MP Kesava Rao Over No Motion On Central Govt

TDP MPS Mets TRS MP Kesava Rao Over No Motion On Central Govt

హైదరాబాద్: ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశంలోని అన్ని పార్టీల ముఖ్యనేతలకు వివరించి కేంద్రంపై యుద్ధం ప్రకటించేందుకు టీడీపీ సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీలను.. టీడీపీ ఎంపీలు ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి కలిసి పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఎంపీలతో సమావేశం అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెట్టేందుకు మా మద్దతు కావాలని కోరారు. ఈ విషయమై టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా కలిసి చర్చించుకుని ఓ నిర్ణాయానికి వస్తామని బదులిచ్చాం. విభజన హామీలను రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అమలు చేసి తీరాల్సిందే. ఇది రెండు రాష్ట్రాలకు చెందిన అంశం" అని ఆయన చెప్పుకొచ్చారు.

English Title
TDP MPS Mets TRS MP Kesava Rao Over No Motion On Central Govt
Related News