'మరోసారి టీడీపీ గెలుపు చారిత్రక అవసరం'

Updated By ManamThu, 05/17/2018 - 18:36
TDP, Historical needed, Chandrababu naidu, Neeru-Pragathi programme, Central govt

TDP, Historical needed, Chandrababu naidu, Neeru-Pragathi programme, Central govtకందుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ టీడీపీ గెలుపు ఓ చారిత్రక అవసరమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో గురువారం  ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో సమర్థమైన, మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో లాభం పొందే ప్రతి వ్యక్తి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ధర్మపోరాటం కొనసాగించాలని, హక్కులను సాధించాలనే ఆవేశం, ఆలోచన అనునిత్యం రావాలని సీఎం ఆకాంక్షించారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపాలో అవినీతిపరులు కొందరు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఆ మాటలన్నీ ప్రజల కోసమే పడుతున్నానన్నారు. దీనిపై ప్రతి ఇంట్లో, ప్రతి వూళ్లొ చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది దయాదాక్షిణ్యాపై కాదని, అతి రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. 

English Title
TDP historical win needed again, says Chandrababu naidu
Related News