మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టీసీఎస్ రికార్డు

Updated By ManamFri, 05/25/2018 - 22:21
tcs-market-capitalization

tcs-market-capitalizationన్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ శుక్రవారం రూ. 7 లక్షల కోట్లను దాటింది. ఈ రకమైన వైులురాయిని స్థాపించిన మొదటి కంపెనీగా అది అవతరించింది. దాని షేర్ ధరలో ర్యాలీ తెచ్చిన శక్తితో, టి.సి.ఎస్ మార్కెట్ విలువ బి.ఎస్.ఇలో ఇంట్రా-డేలో రూ. 7,03,309 కోట్లను మించింది. ఎక్చ్సేంజిలో టి.సి.ఎస్ షేర్ ధర 52 వారాల్లో అత్యధిక స్థాయిలో రూ. 3,674ను తాకింది. కంపెనీ మార్కెట్ క్యాపిటైలెజేషన్‌ను దాన్ని బట్టే లెక్క గట్టారు. మొత్తం షేర్ల సంఖ్యతో ఒక షేర్ విలువను గుణించగా వచ్చిన మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. టి.సి.ఎస్ షేర్లు 1.91 శాతం పెరిగి రూ. 3,674కు చేరాయి. కంపెనీ షేర్లు ఈ ఏడాది ఇంతవరకు దాదాపు 35 శాతం పెరిగాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది మొదట్లో రూ. 6 లక్షల కోట్ల స్థాయిని దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఆ రకమైన ఘనతను సాధించిన రెండవ కంపెనీగా అది గణుతికెక్కింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో స్తితిగతులకు అద్దంపట్టే టి.సి.ఎస్ గత నెలలో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ట్రేడింగ్ సెషన్  ముగించి, ఆ రకమైన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. దేశంలో అత్యంత విలువైన సంస్థ టి.సి.ఎస్. రూ. 5,83,908.87 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండవ స్థానంలో ఉండగా, రూ. 5,19,654.83 కోట్లతో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, రూ. 3,42,244.47 కోట్లతో హెచ్.యు.ఎల్, రూ. 3,30,919.46 కోట్లతో ఐ.టి.సి ఆ తర్వాత స్థానాలలో ఉన్నాయి. దేశం నుంచి అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుగా ఉన్న టి.సి.ఎస్ 2018 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి 4.4 శాతం పెరుగుదలతో రూ. 6,904 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు ఏప్రిల్ 19న ప్రకటించింది.

English Title
TCS record in market capitalization
Related News