సచిన్, కోహ్లీ రికార్డులు బద్దలు చేసిన టేలర్

Mitchell Starc

ముంబై: న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ (137 పరుగులు) అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. ఈ ఘనతతో ఒకే ఫార్మాట్‌లో 20 శతకాలు సాధించిన న్యూజిలాండ్ తొలి ఆటగాడిగా టేలర్ అవతరించాడు. కొన్నాళ్లుగా అతడు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా 50ం స్కోర్లు చేస్తున్నాడు. గత ఆరు వన్డేల్లో 181 నాటౌట్, 80, 86 నాటౌట్, 54, 90, 137 స్కోర్లు సాధించాడు. దీంతో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలయ్యాయి. గతంలో విరాట్ కోహ్లీ, సచిన్ వరుసగా ఐదు వన్డేల్లో 50ం పరుగులు చేశారు. టేలర్ వరుసగా ఆరు ఇన్నింగ్సుల్లో ఈ 50ం స్కోర్లు చేసి వారి రికార్డులను బద్దలుకొట్టాడు. అంతే కాకుండా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ఆండ్రూ జోన్స్, మహ్మద్ యూసఫ్ (పాక్), గోర్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), మార్క్ వా (ఆస్ట్రేలియా) ఘనతను సమం చేశాడు. అయితే జావెద్ మియాందాద్ (పాకిస్థాన్) 1987లో వరుసగా 9 సార్లు 50ం స్కోర్లు చేసి అందరికన్నా ముందున్నాడు.

సంబంధిత వార్తలు