టాటాలకే భూషణ్ స్టీల్

Updated By ManamTue, 05/15/2018 - 22:47
tatasteel

tatasteelన్యూఢిల్లీ: రుణాల ఊబిలో కూరుకున్న భూషణ్ స్టీల్ స్వాధీనానికి టాటా స్టీల్ వేసిన బిడ్‌ను జాతీయ కంపెనీలా ట్రైబ్యునల్ మంగళవారం ఆమోదించింది. టాటా స్టీల్ బిడ్‌ను వ్యతిరేకిస్తూ భూషణ్ స్టీల్ ఉద్యోగులు దాఖలు చేసిన అభ్యర్థనను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. వారికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. రుణాన్ని తిరిగి రాబట్టుకోవడం లో తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఇంజనీరింగ్, నిర్మాణ రంగ అగ్ర సంస్థ ఎల్ అండ్ టి పెట్టుకున్న అభ్యర్థనను కూడా ట్రైబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎం. కుమార్, ఎస్. కె. మహాపాత్రలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. దానికి కూడా లక్ష రూపాయల అపరాధ రుసుము విధించింది. భూషణ్ స్టీల్‌కి ఆపరేషనల్ క్రెడిటర్‌గా ఉన్న ఎల్ అండ్ టి పరిష్కార ప్రక్రియలో రుణ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడంలో దానిని ఫైనాన్షియల్ క్రెడిటర్లతో సమానంగా పరిగణించాలని కోరుకుంది. భూషణ్ స్టీల్‌తో తన విద్యుత్ కొనుగోలు ఒప్పం దాన్ని కొనసాగించాలని భూషణ్ ఎనర్జీ పెట్టుకున్న అభ్యర్థనను కూడా ట్రైబ్యునల్ తిరస్కరించింది. ఈ ఉత్తర్వును మంగళవారం కోర్టులో  వినిపించారు. సవివర తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైబ్యునల్ ముఖ్య ధర్మాసనం అన్ని పక్షాల వాదనలను విన్న తర్వాత, ఉత్తర్వును రిజర్వులో ఉంచుతున్నట్లు ఇంతకుముందు ఏప్రిల్ 11న ప్రకటించింది. టాటా స్టీల్ ఇవ్వజూపిన రూ. 32,500 కోట్లను, భూషణ్ స్టీల్‌లో ఇవ్వజూపిన 12.27 శాతం ఈక్విటీని రుణ దాతల కమిటీ ఆమోదించింది. అయితే, భూషణ్ స్టీల్‌లోని కొందరు ఉద్యోగులు దాన్ని ట్రైబ్యునల్‌లో సవాల్ చేశారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్స్రీ కోడ్‌లోని సెక్షన్ 29 (ఎ) కింద టాటా స్టీల్‌కి బిడ్ చేసే అర్హత లేదని వారు వాదించారు. 
 

Tags
English Title
Tata Steel Bhushan Steel
Related News