తమన్నా ‘నెక్ట్స్ ఏంటి’ ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 11/09/2018 - 13:17
Next Enti
Next Enti

బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ(ఫనా ఫేమ్) దర్శకత్వంలో సందీప్ కిషన్, తమన్నాలు ఓ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. నవదీప్, పూనమ్ కైర్, లారిస్సా బొనెసీ తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెక్ట్స్ ఏంటి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. తాజాగా చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇక రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. అక్షయ్ పూరి, రైనా జోషి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Tamannaah's next enti first look released
Related News