తాజ్ మహల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated By ManamWed, 07/11/2018 - 14:43
Taj Mahal
  • తాజ్‌ మహల్ సంరక్షణపై కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం

Taj Mahal

న్యూఢిల్లీ :  తాజ్  మహల్ కట్టడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యకు ఓ పురావస్తు కట్టడం ద్వారా పరిష్కారం లభిస్తుంటే దానిపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తోందని న్యాయస్థానం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉదాసీనత వల్ల దేశానికి వాటిల్లే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించింది. ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్ నిర్వహణ లోపాలపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరును సుప్రీం తప్పుబట్టింది. 

‘తాజ్ మహల్‌ను సంరక్షించుకోరా...  మీరే దానిని నాశనం చేస్తారా? లేక కాలుష్యం కారణంగా వన్నె తగ్గిన తాజ్‌కు పూర్వవైభవం తీసుకొస్తారా’అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య స్మృతికి చిహ్నంగా తాజ్ మహల్‌ను కట్టించిన విషయం తెలిసిందే.

ప్రపంచ వింతల్లో ఒకటిగా స్థానం సంపాదించిన ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి వేలాదిగా సందర్శకులు తరలివస్తారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు విదేశీ మారక నిల్వలు జమ అవుతాయి. దేశ ఆర్థిక పరిపుష్ఠికి ఈ నిల్వలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక రంగానికి దన్నుగా నిలుస్తున్న కట్టడంపై ఎంత శ్రద్ధ తీసుకోవాలంటూ సుప్రీం ధర్మాసనం నిలదీసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మన తాజ్‌మహలే అద్భుతమైన నిర్మాణమని న్యాయమూర్తులు కొనియాడారు. 

టీవీ టవర్‌లాంటి ఈఫిల్ టవర్ సందర్శకుల కన్నా తాజ్‌ను సందర్శించే వారి సంఖ్యే ఎక్కువని చెప్పారు. ఇంతటి ప్రసిద్ధ కట్టడంపట్ల ప్రభుత్వం ఉదాసీనత వైఖరి ప్రదర్శించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. గతంలో కాలుష్యం కారణంగా తాజ్ రంగుమారుతున్న క్రమంలో ఆ పరిసరాలలో కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. దాంతోపాటే తాజ్ సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)కి ఆదేశాలు జారీ చేసింది.

భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యకు ఓ పురావస్తు కట్టడం ద్వారా పరిష్కారం లభిస్తుంటే దానిపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ ఉదాసీనత వల్ల దేశానికి వాటిల్లే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించింది. ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్ నిర్వహణ లోపాలపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరును సుప్రీం తప్పుబట్టింది. ‘తాజ్ మహల్‌ను మూసేయాలంటూ ఆదేశాలిమ్మంటారా.. మీరే దానిని నాశనం చేస్తారా? లేక కాలుష్యం కారణంగా వన్నె తగ్గిన తాజ్‌కు పూర్వవైభవం తీసుకొస్తారా’ అంటూ జస్టిస్ ఎంబీ లోకుర్, దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదహారో శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య స్మృతికి చిహ్నంగా తాజ్ మహల్‌ను కట్టించిన విషయం తెలిసిందే! ప్రపంచ వింతల్లో ఒకటిగా స్థానం సంపాదించిన ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి వేలాదిగా సందర్శకులు తరలివస్తారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు విదేశీ మారక నిల్వలు జమ అవుతాయి. దేశ ఆర్థిక పరిపుష్ఠికి ఈ నిల్వలు ఎంతగానో తోడ్పడతాయి. ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక రంగానికి దన్నుగా నిలుస్తున్న కట్టడంపై ఎంత శ్రద్ధ తీసుకోవాలంటూ సుప్రీం ధర్మాసనం నిలదీసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మన తాజ్‌మహలే అద్భుతమైన నిర్మాణమని న్యాయమూర్తులు కొనియాడారు. టీవీ టవర్‌లాంటి ఈఫిల్ టవర్ సందర్శకుల కన్నా తాజ్‌ను సందర్శించే వారి సంఖ్యే ఎక్కువని చెప్పారు. ఇంతటి ప్రసిద్ధ కట్టడంపట్ల ప్రభుత్వం ఉదాసీనత వైఖరి ప్రదర్శించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. గతంలో కాలుష్యం కారణంగా తాజ్ రంగుమారుతున్న క్రమంలో ఆ పరిసరాలలో కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. దాంతోపాటే తాజ్ సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)కి ఆదేశాలు జారీ చేసింది. కాగా, తాజ్ పరిసరాలలో కాలుష్య స్థాయులపై ఐఐటీ కాన్పూర్ పరిశోధన జరుపుతోందని, నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా కాలుష్యానికి మూల కారణాన్ని అన్వేషించి, నివారణ మార్గాలను చూపేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమించినట్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. దీంతో ఈ కేసుకు సంబంధించి జూలై 31 నుంచి రోజువారీగా విచారణ జరపనున్నట్లు సుప్రీం బెంచ్ వెల్లడించింది.

English Title
Taj Mahal must be protected or demolished: Supreme Court
Related News