చారిత్రాత్మక భవనంలో ‘సైరా’ షూటింగ్

Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవలే ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర తదుపరి చిత్రీకరణ డిసెంబర్ చివర్లో ప్రారంభం కానుంది. ఇక ఈ షెడ్యూల్‌ను చారిత్రాత్మక భవనం మైసూర్‌ ప్యాలెస్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన తారాగణంపై ఇక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార మొదటిసారిగా జోడీ కడుతుండగా.. అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు