మట్టి ప్రతిమలతోనే మనుగడ 

Updated By ManamThu, 09/13/2018 - 04:12
vinayakudu

vinayakaమన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి  మనం చేసుకునే చాలా పండుగలకు, ప్రకృతికి విడ దీయరాని సంబంధం వుంది. చెట్లను  కాపాడుకోవ డం, సహజ వనరులను, ప్రకృతిని ప్రేమించడం, చెరు వులను, కుంటలను రక్షించడం మనం చేసుకునే పండుగల్లోని విశిష్ట లక్షణం. నాగరికత ముసుగులో రానురాను పండుగలు, ఉత్సవాలలో అసలు స్ఫూర్తి లోపించి పైపై హంగులు పెరగడం చాలా బాధాకర పరిణామం. ఇందుకు చక్కటి ఉదాహరణ గణేష్ ఉత్స వాలు. తొమ్మిది రోజుల పాటు వీధివీధిన కొలువు దీరే బొజ్జ గణపయ్యలు చూడముచ్చటైన రూపాల్లో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలలో గణేష్ నిమజ్జనం ఓ అపురూ ప ఘట్టం. దాదాపు లక్షకుపైగా విగ్రహాలు కొలువు దీరబోతున్నాయి. ఇక విఘ్నేశ్వరుడిని ఆరాధించే ప్రతి ఇంటిలోనూ మరికొన్ని లక్షల  సంఖ్యలో విగ్రహాలు పూజలందుకోబోతున్నాయి. అయితే, ఒకప్పుడు బొజ్జ గణపయ్యలను పూర్తిగా మట్టితోనే తయారు చేసేవారు. వాటిని పూజించిన అనంతరం సమీపంలోని చెరువు లోనో, కుంటలోనో నిమజ్జనం చేసేవారు. అయితే, కాలక్రమంలో మట్టి విగ్రహాల వాడకం తగ్గి, భారీ సెట్టింగ్‌లు, కళ్లు మిరుమిట్లు గొలి పే వివిధ రకాల రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేయడం పిచ్చిగా మారింది. అయితే కొంత మంది ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం పర్యావరణానికి ముప్పు తెస్తోంది. 

నిమజ్జనం చేసిన గణనాథుడి విగ్రహాల తాలుకు రసాయనాల రంగులు నీళ్లలో కలిసి, జల కాలుష్యానికి కారణమవుతున్నాయి. నిమజ్జనం అనంతరం వినా యక విగ్రహాల అవశేషాలను తొలగించడం శక్తికి మిం చిన భారంగా మారుతోంది. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించిన అనేకమంది ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థ లు, పర్యావరణవేత్తలు మట్టి వినాయకుల ఆవశ్యకతను వివరిస్తూ, ప్రచారం నిర్వహించడం, మట్టి వినాయకు లను పంపిణీ చేయడం ఓ మంచి పరిణామం. ఈ స్పృహ మనలో మరింత వెల్లివిరియాలి. జలకాలుష్యా నికి తామలేకుండా, పర్యావరణానికి హాని కలుగని రీతి లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవడమే ఇ ప్పుడు మనందరి బాధ్యత. విజ్ఞుల పర్యావరణవేత్తల మాటలను ఇప్పుడు మనం పెడచెవిన పెడితే, మనం భవిష్యతులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుం ది. ఇప్పటికే అనేక పారిశ్రామిక వ్యర్థాలు, పరిశ్రమలు వెదజల్లే రసాయనాల కారణంగా అనేక జలవనరులు కలుషితమయ్యాయి. విగ్రహాలకు వేసిన రంగులు నీటి లో కరగక పోవడంతో నీరు కలుషితమై జలచరాల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. విగ్రహా లను చెరువుల్లో నిమజ్జనం చేసిన తర్వాత ఆ పరిసరా ల్లో ఉన్న నీటిని పశువులకు కొన్నిరోజుల వరకు తాగిం చలేకపోతున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇప్పటికే చాలామంది మేధావులు కృషిచేస్తున్నారు.  పలువురు ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మట్టితో చేసిన ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావ రణ పరిరక్షణకు దోహదపడుతున్నారు. రసాయనాలతో తీర్చిదిద్దిన విగ్రహాలు అందంగా చూడటానికి బాగుం టాయి. కానీ వాటివల్ల కలిగే అనర్థాలు చాలా ఎక్కువ. రసాయనాలతో తయారుచేసే విగ్రహాలపై ఆంక్షలు విధి స్తే ప్రయోజనకరంగా ఉంటుంది. గతంతో పోల్చితే ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరిగిం దనే చెప్పాలి. ఎక్కువగా మట్టి గణనాథుడినే పూజిం చేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. మట్టి విగ్ర హాలను పూజించి కాలుష్యాన్ని అరికట్టవచ్చనే సత్యం ప్రజలకు మరింతగా చేరువ కావాల్సిన అవసరం ఉంది. 
 కాళంరాజు వేణుగోపాల్  
ఉపాధ్యాయుడు 
  8106204412

English Title
Survival with clay images
Related News