ఐయామ్ ఓకే: రాకేష్ రోషన్

Surgery done, all is okay says Rakesh Roshan

ముంబై : శస్త్రచికిత్స చేయించుకున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, నిర్మాత రాకేశ్ రోషన్ ...‘ఆల్ ఈజ్ ఓకే’ అని అన్నారు. మంగళవారం ఆయనకు సర్జరీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాకేశ్ రోషన్ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ..‘శస్త్రచికిత్స పూర్తయింది. నేను బాగానే ఉన్నా.. గాడ్ ఈజ్ గ్రేట్... మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు. శుక్ర, శనివారాల్లో తిరిగి ఇంటికి వెళతా’ అని తెలిపారు. 

కాగా రాకేష్ రోష‌న్ గొంతు క్యాన్సర్‌(స్కామస్ సెల్ కార్సినోమా)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు హృతిక్ రోషన్ ధ్రువీకరించాడు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాకేష్ రోషన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ కూడా చేశారు.
 

సంబంధిత వార్తలు