సుప్రీంలో టీ.సర్కార్‌కు చుక్కెదురు

Supreme Court rejects Telangana Government Petition Over Reservations in local body elections

న్యూఢిల్లీ : పంచాయతీరాజ్‌ సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. రిజర్వేషన్లు పెంచాలన్న టీ సర్కార్  అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. రిజర్వేషన్లు యాభై శాతం కంటే మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ...ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగగా, తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచాలంటూ కోరింది. అయితే పంచాయతీరాజ్‌ సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా  ప్రస్తుతం రాష్ట్రంలో వెనుకబడిన కులాల (బీసీ)కు 34శాతం, షెడ్యూల్డు కులాలు (ఎస్సీ)కు 18.3శాతం, షెడ్యూల్డు తెగ(ఎస్టీ)లకు 8.25శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

సంబంధిత వార్తలు