టాస్ గెలిచి సన్‌రైజర్స్ ఫీల్డింగ్..

Updated By ManamThu, 05/17/2018 - 19:59
Sunrisers Hyderabad, toss and elected to field, Royal Challengers Bangalore, IPL 2018

Sunrisers Hyderabad, toss and elected to field, Royal Challengers Bangalore, IPL 2018బెంగళూరు: ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా గురువారం ఇక్కడ బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బెంగళూరు జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సన్‌‌రైజర్స్‌లో ఒక మార్పు చోటుచేసుకోగా, భువనేశ్వర్ కుమార్ స్థానంలో బసిల్ థంపీకి తుదిజట్టులో చోటు దక్కింది. బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. బెంగళూరు ఓపెనర్లుగా పార్థీవ్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగగా, సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ తొలి ఓవర్ అందుకున్నాడు.

English Title
Sunrisers Hyderabad won the toss and elected to field



Related News