ఇన్‌ఫార్మర్ నెపంతో సబ్‌పోస్టుమాస్టర్ హత్య

Updated By ManamThu, 08/09/2018 - 23:47
murder
  • తమ పనేనని ప్రకటించిన మావోయిస్టులు  

imageవిశాఖపట్నం: ఆంధ్ర- ఒడిస్సా సరిహద్దులో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ అని పేర్కొంటూ ఓ పోస్టుమాస్టర్‌ను హత్య చేశారు. సీలేరు పోలీసుస్టేషన్‌కు 7 కిలోమీటర్లు దూరంలో మల్కన్‌గిరి జిల్లాకు చెందిన పప్పులూరి సబ్‌పోస్ట్‌మాస్టర్ పి.సత్యనారాయణను గురువారం తెల్లవారుజామున అతి కిరాతకంగా హతమార్చారు.

ఘటనా స్థలంలో హత్య ఎందుకు చేశారో పేర్కొంటూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి పేరిట ఓ లేఖ ఉంచారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోస్టుమాస్టర్ పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. తీరు మార్చుకోవాలని తమ కార్యకర్తలు అతనిని పలుమార్లు హెచ్చరించారని, అయినా మార్పు రాకపోవడంతో ప్రజాకోర్టులో శిక్ష విధించామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజన్సీ పర్యటన రోజే ఈ సంఘటన జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

English Title
Submastemaster murdered with Informer Snap
Related News