ఇక నుంచి తెలుగులో స్టార్‌స్పోర్ట్స్

star spots
  • 7 నుంచి ప్రసారాలు ప్రారంభం

హైదరాబాద్: స్పోర్ట్స్ ప్రసార కార్యక్రమాల్లో అంతర్జాతీయంగా తిరుగులేని స్థాయిలో దూసుకుపోతున్న స్టార్స్ స్పోర్ట్స్ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చానెల్‌గా మరో అడుగు ముందుకేసింది. ఈ స్టార్‌స్పోర్ట్స్ 1 తెలుగు ఇరు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి లైవ్ చానెల్‌గా మొదలుకాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడలను అమితంగా ఇష్టపడేవారికోసం ఇను నుంచి తెలుగు భాషలోనే అన్ని కార్యక్రమాలను ప్రసారం చేయబోతుంది. ఈ చానెల్ వివో ప్రో కబడ్డీ లీగ్‌తో కలిసి తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశంలో, స్థానికంగా జరిగే అన్ని క్రీడల కార్యక్రమాలను ఇక నుంచి తెలుగు భాషలోనే ప్రసారం చేయబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు టైటాన్స్ లీడింగ్ రైడర్ రాహుల్ చౌదరి మాట్లాడుతూ... ‘ గత కొన్ని సీజన్ల నుంచి నాకు ఇక్కడి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోంది. నన్ను, నా టీమ్ తెలుగు టైటాన్స్ జట్టుని ఇక్కడి ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. మాపై వారు చూపే అభిమానం వెలకట్టలేనిది. ఇప్పటీవరుకు స్టార్ స్పోర్ట్స్‌ని నేను హిందీలో చూసి ఎంజాయ్ చేసేవాడ్ని. ఇక నుంచి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో వస్తోంది. తెలుగు అభిమానులు ఇక నుంచి మనకు నచ్చిన భాషలోనే మ్యాచ్‌లు చూసి ఆనందించవచ్చు. ఇది మనందర్ని ఒకటి చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని రాహుల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో పాటు స్టార్‌స్పోర్ట్స్ ప్రతినిధి, వివో ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు