జూలై నుంచి గిరిజన విశ్వవిద్యాలయ తరగతులు ప్రారంభించండి

sk Joshi
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషీ ఆదేశం

హైదరాబాద్: గిరిజన విశ్వవిద్యాలయం  ద్వారా వచ్చే జులై నుండి 6 కోర్సులలో 30 మంది విద్యార్ధుల చొప్పున తరగతులు ప్రారంభించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి పంబందిత అదికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎస్.కె జోషి గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, అటవీశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అధికారులతో గిరిజన యూనివర్సిటిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటి ద్వారా జాకారం వద్ద ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్ లో తరగతుల నిర్వహణను చేపట్టాలని, అందుకనుగుణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అధికారులు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. యూనివర్సిటిలో స్ధానిక గిరిజన యువత కోసం 30 శాతం సూపర్ న్యూమరి సీట్లను కేటాయించాలని సి.యస్ ఆదేశించారు. బి.ఏ (ెటల్ మేనేజ్‌మెంట్), బిసిఏ, ఎంసిఏ, ఎంబిఏ, బిబిఏ  కోర్సులలో తరగతులు ప్రారంభించాలన్నారు. ఈ యూనివర్సిటి ద్వారా స్ధానిక గిరిజన విద్యార్ధుల విద్యాభివ ద్ధికి, గిరిజనుల ఆర్ధికాభివ ద్ధికి తోడ్పతుందని అన్నారు. భూసేకరణకు సంబంధించి రూ.10 కోట్ల రూపాయలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరుకు ఇవ్వాలన్నారు. అటవీశాఖకు సంబంధించిన భూమిలో అటవీ చట్ట నిబంధనలలో అనుమతించిన మేరకు గిరిజన సంస్క తికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గిరిజన యూనివర్సిటి కమిటిలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులను సభ్యులుగా నియమించాలన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

Tags

సంబంధిత వార్తలు