శ్రీ వినాయక వ్రత కల్పం

Updated By ManamThu, 09/13/2018 - 04:55
ganapathi

ganapathiదీపారాధన:  (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుంది వద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)
శ్లో॥    భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్
    యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ॥
    దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు॥
పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బ్రొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!
యస్మరేత్ పుండరీకాక్షం సుబాహ్యాంతరశ్శుచిః
పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః
శ్రీరస్తు          శుభమస్తు          అవిఘ్నమస్తు

శ్రీ గణేశాయ నమః 
శ్లో॥    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥
    అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
    అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ॥
శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః
శ్లో॥    సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః
    లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 
    ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
    వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః
    షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః
    విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,
    సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ॥

ఆచమనం:
ఓం కేశవాయ స్వాహా
నారాయణాయ స్వాహా
మాధవాయ స్వాహా 
(అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి)
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః వామనాయ నమః
శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః దామోదరాయ నమః
సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః
నారసింహాయ నమః అచ్యుతాయ నమః
జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః
హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)
శ్లో॥    ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః
    ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!
    (ముక్కుపట్టుకుని ఈ క్రింది మంత్రం చెప్పవలెను)
ప్రాణాయామము:
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌॥ ఓమాపో జ్యోతీ
రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‌॥

సంకల్పము: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా - గోదావరి మధ్యదేశే స్వగృహే (సొంత ఇల్లు కానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీవిళంబినామసంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థి తిథౌ బృహస్పతి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ గోత్రః............. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............... (యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య  క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివ ద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే॥
(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచితీయవలెను) 
తదంగ కలశపూజాం కరిష్యేః
(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచితీయవలెను)
కలశపూజ:
(కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)
శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రీతః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!
ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రీతాః
గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి!
నర్మదే సింధు కావేరి జలేస్మిం సన్నిధింకురు ॥
అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః 
కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః
(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టుపెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్ప యామి (నమస్కరించవలెను)
గణానాంత్వా గణపతిగ్‌ హవామహే కవిం కవీనా
    ముపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత

ఆనసృణ్వన్నూతిభిస్సీదసాదనం
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)
పాదయోః పాద్యం సమర్పయామి  (మరల నీటిని చల్లవలెను)
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !! (మరల నీటిని చల్లవలెను)
ముఖే ఆచమనీయం సమర్పయామి !!
(మరల నీటిని చల్లవలెను)
ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)
స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)
గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)
కుంకుమం సమర్పయామి !! 
గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి 
(అక్షతలు చల్లవలెను)
పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)
స్వామికి పుష్పాలతో పూజ:
(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)
ఓం సుముఖాయ నమః    ఓం ఏకదంతాయ నమః 
ఓం కపిలాయ నమః    ఓం గజకర్ణకాయ నమః 
ఓం లంబోదరాయ నమః    ఓం వికటాయ నమః 
ఓం విఘ్నరాజాయ నమః    ఓం గణాధిపాయనమః 
ఓం ధూమకేతవే నమః    ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం ఫాలచంద్రాయ నమః    ఓం గజాననాయ నమః 
ఓం వక్రతుండాయ నమః    ఓం శూర్పకర్ణాయ నమః 
ఓం హేరంబాయ నమః    ఓం స్కంద పూర్వజాయ నమః 
ఓం మహాగణాధిపతయే నమః 

నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి 
(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)
ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)
దీపం దర్శయామి (దీపమును చూపవలెను)
నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‌॥ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, 
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, 
ఓం సమానాయ స్వాహా
శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం 
గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
హస్తప్రోక్షయామి, పాదవ్ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)
తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి

(కర్పూరమును వెలిగించాలి)
శ్లో॥    వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ 
    అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో  భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)
శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి 
(పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)
స్వామిన్, సర్వజగన్నాధ యావత్పూజావసానగా
తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు
ధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతిలో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) 
ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం॥
విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే॥ 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం॥
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌॥ 
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ॥ 
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ॥ 
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం॥
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. 

(వినాయకుని ధ్యానించండి...)
ప్రాణ ప్రతిష్ట: (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః  
ప్రాణానేవ యథాస్థాన మువహ్వ యతే ॥ 
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు॥ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద॥ 
ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి॥ (విఘ్నేశ్వరునికి స్వాగతం చెప్పడం)
ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండి నట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).
మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగ హ్యతామ్‌॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి॥
పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుచ్చున్నట్లు భావించటడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో॥ సర్వతీర్థ సముద్భూతం ॥ పాద్యం గంగాది సంయుతం॥ విఘ్నరాజ! గృహాణేదం॥ భగవస్భక్త వత్సల॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి॥
అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి॥
ఆచమనీయమ్: స్వామి వారి నోటికి నీళ్ళు అందించడం త్రాగుచున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం 

సమర్పయామి॥
మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ॥ మధుపర్కం గృహాణేదం గణనాదం నమోస్తుతే॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. 
పంచామృత స్నానమ్: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)
పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృషిణ యం భవా వాజన్య సంగథే॥ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి॥
పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణ ఆయూగ్షి తారిషత్‌॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి॥
నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి॥
తేనె: ఓం మధువాతా బ్నుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ! మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్ రజః మధుద్యైరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‌ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః॥  శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి॥
పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే బృహస్పతయే మధుమాగ్ ఆదాభ్యః॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి॥ 
(మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామ తైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్ప యామి. 
ఫలోదకమ్: (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) 
యాః ఫలినీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః 
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్హనః॥ 
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః 
ఫలోదకేన స్నపయామి॥
శుద్ధోదకమ్: మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథా శక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి॥ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి॥ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను  బట్టతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)
వస్త్రమ్: (నూతన వస్త్రమ్రులనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వ్రయాన్ని గాని ఈక్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ॥  శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి॥
యజ్ఞోపవీతమ్: (పత్తితో చేసిన యజ్ఞోప వీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక॥ 

శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి॥
గంధమ్: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.
అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి॥
సింధూరం: శ్లో॥ ఉద్యద్భాస్కర సంకాశం॥ సంధ్యా వదరుణం ప్రభో॥ వీరాలంకరణం దివ్యం॥ సింధూరం ప్రతిగృహ్యతాం॥ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి॥
మాల్యం: శ్లో॥ మాల్యాదీవి సగంధాని॥ మాలత్యా దీనివై ప్రభో॥ మయాహ తాని పుష్పాణి॥ ప్రతిగృహ్ణీష్య శాంకర॥ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి॥

పుష్పమ్: (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అథాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలనుగానీ, పత్రితోగాని పూజించాలి. ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో దూర్వాలతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)
సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి॥
అథాంగ పూజా: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)
గణేశాయ నమః    పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః    గుల్ఫౌ పూజయామి
విఘ్నరాజాయ నమః    జానునీ పూజయామి
కామారిసూనవే నమః    జజ్ఘే పూజయామి
ఆఖువాహనాయ నమః    ఊరూ పూజయామి
హేరంబాయ నమః        కటిం పూజయామి
లంబోదరాయ నమః    ఉదరం పూజయామి
గణనాథాయ నమః        హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః    కంఠం పూజయామి
పాశహస్తాయ నమః        హస్తౌ పూజయామి
గజవక్త్రాయ నమః        వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః        నేత్రౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః        కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః    లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః        శిరః పూజయామి
శ్రీ గణాధిపాయ నమః    సర్వాణ్యంగాని పూజయామి॥
ఏకవింశతి పత్ర పూజ
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి 
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి    
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి  
ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి 
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి    
ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి
ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి    
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి    
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి    
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి
ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి॥     
(21 రకముల ఆకులకు కలిపి వేసి నమస్కారము చేయవలెను) 
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ
(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)
గణాధిపాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
పాశాంకుశధరాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
ఆఖువాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
వినాయకాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
ఈశపుత్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
ఏకదంతాయనమః దుర్వారయుగ్మంపూజయామి!
ఇభవక్త్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
మూషికవాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
కుమారగురవే నమః దూర్వారయుగ్మం పూజయామి!
కంపిలవర్ణాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
బ్రహ్మచారిణేనమః దూర్వారయుగ్మం పూజయామి!
మోధికహస్తాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
సురశ్రేష్టాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
గజనాసికాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
కపిత్తఫలిప్రియాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
గజముఖాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
సుప్రసన్నాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
సురాగ్రజాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
ఉమాపుత్రాయనమః దూర్వారయుగ్మం     పూజయామి!
స్కందప్రియాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
శ్రీ వరసిద్ది వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి 
- దూర్వారయుగ్మం సమర్పయామి
(అనంతరం స్వామి వారి అష్టోత్తర శతనామం చేయాలి)
బిల్వం: శ్లో॥ త్రిదళం త్రిగుణాకరం॥ త్రినేత్రంచ త్రియాయుషం॥ త్రిజన్మ పాప సంహారం॥ శివార్పణం ॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః 

బిల్వపత్రం సమర్పయామి. 
ధూపమ్: (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం॥ ఉమా సుత నమస్తుభ్యం గృహాణవరదో భవ॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. 
దీపమ్: (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) స్వాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే॥ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి॥
నైవేద్యమ్: (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి


ఉంచాలి.  వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)
    ఓమ్ భూర్భువస్సువః  ఓం తత్సవితుర్వరేణ్యం
    భర్గోదేవస్య ధీమహి  ధియోయనః ప్రచోదయాత్ ॥
    (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)
    ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి॥
    ఓమ్ ఋతంత్వా సత్యేన పరిషించామి॥ 
సుగంధాన్ సుకృతాంశెచైవ మోదకాన్ ఘ తపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)
ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి॥
(5 సార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా ఓమ్ అపానాయ స్వాహా ఓమ్ వ్యానాయ స్వాహా ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా॥ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపి దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి॥
తాంబూలమ్: 
(3 తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగ హ్యతామ్‌॥ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి॥
నీరాజనమ్: (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయాదత్తం గ హాణ వరదోభవ॥ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్య్ర యాముఖే తయామా సగ్ సృజామసి॥ సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళానిభవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి॥ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి॥ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)
మంత్రపుష్పమ్: (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)
గణాధిప నమస్తేస్తు
ఉమాపుత్రా విఘ్ననాశన
వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక॥
ఏకదంతైక వద న తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‌॥
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్ ॥
శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మప్రదక్షిణ నమస్కారమ్‌: (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి
నమస్కారం చేయాలి. అంతేగానీ తనచుట్టూ తాను తిరగకూడదు)
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశ న॥
యానికానిచ పాపాని జన్మాంతక కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మానాం పాపాత్మ పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అనాథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ప్రార్థన
(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిన గణపతి పాదాల వద్ద ఉంచాలి)
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‌॥
వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియం నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥
శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి॥
సాష్టాంగ నమస్కారమ్
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే॥ శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి॥
శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం
మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి

సుప్రీత స్సుప్రసన్నో వరదాభవతు.
(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము).
అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక ॥ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక ॥ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి ॥ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).
(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)
అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.
(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.
పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలిసికొని రప్పించుకొను మార్గము తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వ త్తాంతము తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపింప, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాదిదేవతలందరి చేతను తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను. 

ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా  శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను.  పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా వెళ్ళెను.
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి అభ్యంగన స్నానమాచరించుటకు నలుగుపిండి పెట్టుకొని ఆ నలుగుపిండితో ఒక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమునమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను.
అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్య పాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారందగ్గర వున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి వానికి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టెను. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను.

కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. 
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పనీ చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.
సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.
అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను.
ఆ మంత్ర ప్రభావముతో అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అటులనే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము.  ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వము’’ అని ప్రార్థించెను.

అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకంరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘‘రాజదృష్టి’’ సోకి నరాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లెను. అతడు మృతుండయ్యె, పార్వతి శోకించుచు చంద్రుని జూచి, 
‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను.
ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపము తనంన తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషి పత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.
ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మ తుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.

అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి,‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గ హములకేగి, భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడక జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.
యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరు లుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్య భగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్య భగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున  సూర్యుడు  సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచియై ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీకృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్దికి, ప్రజా సంక్షేమమునకు  ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను.
అది తెలిసిన  సత్రాజిత్తు  ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై ఆరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణముగ ప్రసేనుడు అశౌచమును పొందెను. ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.

ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వేరే దిక్కునకు వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు  తన మందిరమునకు  తిరిగి వచ్చెను.  దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు  భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో  వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గురమ్రును తిని యుండునని నిష్టూరముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.
కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న  ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆట వస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని  భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన  విధము చెప్చెను.

అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై  శ్రీకృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్దమునకు  తలపడెను. 
ఆ కృష్ణుడే రామావతార కాలమున  జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబంవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని  కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్దమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవ! ఆర్తజనరక్ష! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా  ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితోపాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి సాగనంపెను.
ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొని శ్రీకృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన  సత్యాభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.
శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే ఇచ్చివేసెను.
అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కాన లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను.

మంగళం  మహత్
చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.

- కథ సమాప్తం -
పునఃపూజ :
ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా నారోహయామి గజానారోహయామి అశ్వానారోహ యామి సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి ॥ 
(స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)
(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామ పూజ
ఓం గజాననాయ నమః 
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం  మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః 
ఓం లంబకర్ణాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మహోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాటత్పయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం శృంగారిణే నమః 
ఓం ఆశ్రీతవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః 
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృ తే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపన్యాసాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థ పనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయనే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః 
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయినే నమః 
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః 
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః 
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వక్‌దృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 
శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

English Title
Sri Vinayaka Vruthu Katha
Related News