‘స్పైడర్ మ్యాన్’ సహ సృష్టికర్త ఇక లేరు

Updated By ManamSat, 07/07/2018 - 15:10
Spyder Man

Spyder Man సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌ క్యారెక్టర్‌ సహ సృష్టికర్త స్టీవ్‌ డిట్కో ఇక లేరు. జూన్ 29న ఆయన మరణించగా ఆ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 90 ఏళ్ల డిట్కో న్యూయార్క్‌లోని తన ఇంట్లో విగత జీవిగా పడి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అంతకు రెండురోజుల ముందే ఆయన ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆయన మృతిపై గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే 1961లో మార్వెల్‌ కామిక్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ స్టాన్‌లీ స్పైడర్‌మ్యాన్‌ పాత్రను రూపొందించారు. ఆ క్రెడిట్‌ స్టాన్‌లీదే అయినా..  స్పైడర్‌మ్యాన్‌ కాస్టూమ్స్‌, వెబ్‌ షూటర్స్‌, డిజైన్‌ ఇలా అంతా డిట్కో రూపొందించారు. అలాగే స్పైడర్‌మ్యాన్‌ సిరీస్‌లోని విలన్‌ పాత్రలు గ్రీన్‌ గోబ్లిన్‌, డాక్టర్‌ అక్టోపస్‌, సాండ్‌మ్యాన్‌, ది లిజర్డ్‌ అన్నీ డిట్కోనే డిజైన్‌ చేశారు. వీటితోపాటు 1963లో డాక్టర్‌ స్ట్రేంజ్‌ పాత్రను ఆయన రూపొందించారు. ఆ తరువాత సహచరుడు స్టాన్‌లీతో విభేదాల కారణంగా మార్వెల్‌ కామిక్స్‌కు గుడ్‌బై చెప్పిన డిట్కో.. డీసీ కామిక్స్‌, ఛార్ల్‌టోన్‌, మరికొన్ని ఇండిపెండెంట్‌ పబ్లిషర్స్‌తో పని చేశారు. ఆ తరువాత 1979లో మార్వెల్‌కు తిరిగొచ్చిన ఆయన.. మెషీన్‌ మ్యాన్‌, మైక్రోనట్స్‌ లాంటి పాత్రలను రూపొందించారు. 1992లో స్క్విరిల్‌ గర్ల్‌ డిట్కో రూపొందించిన చివరి పాత్ర. మరోవైపు ఆయన మృతిపై హాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Spyder Man Co-Creator Ditko dies
Related News