దేవెగౌడ పెద్ద కొడుకుకు బీజేపీ ఆఫర్

Updated By ManamTue, 05/15/2018 - 17:18
Split and Win: BJP Luring JDS Chief Devegowda Elder Son Revanna
  • రేవణ్ణ వర్గం ఎమ్మెల్యేలకు ఎర.. జేడీఎస్ చీలికకు బీజేపీ వ్యూహం

Split and Win: BJP Luring JDS Chief Devegowda Elder Son Revanna

బెంగళూరు: కర్ణాటక బరి రసవత్తరంగా మారిపోయింది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా జేడీఎస్‌కు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. తాజాగా రంగంలోకి దిగిన బీజేపీ.. కాంగ్రెస్ పాచికలు పారకుండా తన రాజకీయ రాజనీతికి పదును పెడుతోంది. జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దేవెగౌడ కుటుంబంలో ఇప్పటికే మూడు వర్గాలున్నాయి. ఆ వర్గాలను విడగొట్టేసి కర్ణాటక పీఠంపైకి ఎక్కాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 112 సీట్లు కచ్చితంగా కావాల్సిందే. అందుకు బీజేపీ కేవలం 8 స్థానాల దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు దీటుగా దేవెగౌడ కుటుంబంలోని ఓ వర్గమైన రేవణ్ణ వర్గాన్ని ఆకర్షించే పనిలో పడింది.

దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా జేడీఎస్ ఎమ్మెల్యేలు విడివిడిగా ఉన్నారు. ఆ వర్గాల్లో రేవణ్ణ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది బీజేపీ. దేవెగౌడ పెద్ద కుమారుడైన రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేస్తోంది. అంతేగాకుండా 12 మంది ఎమ్మెల్యేల బలమున్న రేవణ్ణ వర్గానికి.. మంత్రి పదవులను ఆఫర్ చేస్తోంది. అయితే, అలా చీలిక తేకుండా ఇప్పటికే కుమారస్వామి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక, ఇటు దేవెగౌడ కూడా తన ఇద్దరు కుమారులను ఇంట్లో కూర్చోబెట్టి చీలిక రాకుండా చర్చలు నడుపుతున్నారు. ఏ ఒక్కరిలోనూ అసంతృప్తి రగలకుండా చూస్తున్నారు. ఈ వ్యూహాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బెంగళూరుకు బయల్దేరారు. 

English Title
Split and Win: BJP Luring JDS Chief Devegowda Elder Son Revanna
Related News