విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamWed, 06/13/2018 - 17:32
Speeding Lorry Rams Into Tourist Bus In Vizianagaram, 3 Slayed

Speeding Lorry Rams Into Tourist Bus In Vizianagaram, 3 Slayed
విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోగాపురం మండలం పోలిపల్లి గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో విశాఖపట్నం, నర్సిపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


ప్రమాదం జరిగిందిలా..!

లారీ యు టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో.. బస్సును ఢీ కొన్నది. దీంతో బస్సు తలకిందులుగా పడిపోయింది. కాశీ విహారయాత్ర ముగించుకుని తమ సొంతగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరో రెండు మూడు గంటల్లో తమ తమ ఇళ్లకు చేరుకుంటామనుకొనే లోపే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో విశాఖలోని నర్సిపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి  ఉంది.

Speeding Lorry Rams Into Tourist Bus In Vizianagaram, 3 Slayed

English Title
Speeding Lorry Rams Into Tourist Bus In Vizianagaram, 3 Slayed
Related News