మాట్లాడేవాడే మొనగాడు 

Updated By ManamSun, 07/22/2018 - 00:49
parlament

అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో జరిగిన మారథాన్ చర్చ సందర్భంగా ఒక్క విషయం అందరికీ బాగా అర్థమైంది. imageఆ అంశం కవరేజి విషయంలో తెలుగు మీడియా ఎవరికి కావల్సినది వాళ్లు రాసుకున్నారు. నలుగురు గుడ్డివాళ్లు ఏను గును చూసినపుడు దాన్ని ఎవరికి కావల్సినట్లు వాళ్లు వర్ణించి నట్లే ఇవీ ఉన్నాయి. అయితే, మొత్తమ్మీద అందరికీ ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. కొన్ని సంవత్సరాల క్రితం ఏ విషయమైనా బయటకు మాట్లాడాలంటూ వచ్చిన ‘మాట్లాడేవాడే మొనగాడు’ అన్న ప్రకటన గుర్తుకొచ్చింది.

పార్లమెంటులో ఎవరు మంచి వాగ్ధాటితో మాట్లాడితే వాళ్లకే ప్రశంసలు దక్కుతాయి. శుక్రవారం నాటి చర్చలో ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసంగాలు వరుసపెట్టి కొన సాగుతూనే ఉన్నా, గట్టిగా నలుగురైదుగురిని మాత్రమే అం తా గుర్తుంచుకున్నారు. వాళ్లంతా బాగా మాట్లాడినవాళ్లే. ఏ విషయం మీదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు చేతిలో కాగి తం అవసరం లేకుండా అనర్గళంగా మాట్లాడగలిగితేనే నలు గురూ మనల్ని గుర్తుంచుకుంటారు. అందుకు ముందుగా సమస్య మీద అవగాహన ఉండి తీరాలి. అలాగే మాట్లాడే విషయం గురించిన స్పష్టత కూడా కలిగి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు ఒకటి, అర అంకెలు చూసుకోడానికి తప్ప మరె ప్పుడూ కాగితాలు చూసుకోవాల్సిన అవసరం ఉండబోదు. అధికార పార్టీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, రాజ్‌నాథ్ సిం గ్, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్లుంటే.. ప్రతిపక్ష కూటమిలో తెలుగుదేశం నుంచి గల్లా జయదేవ్, రామ్మో హన్ నాయుడు, కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాంధీ- ఈ ఐదా రుగురు మాత్రమే ఆకట్టుకోగలిగారు.
 
తెలుగుదేశం ఊహించని స్పీకర్ నిర్ణయం
నిజానికి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ.. ఇలా చాలా పార్టీలు వరుసపెట్టి అవిశ్వాస తీర్మానం నోటీసులను దాదాపు ప్రతిరోజూ ఇస్తూనే ఉన్నా, సభ అదుపులో లేదన్న కారణం చూపించి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ నోటీసులను తిరస్క రిస్తూనే వచ్చారు. దాంతో ఆ సమావేశాలలో ఈ అంశం అస లు చర్చవరకు రానే లేదు. ఈసారి కూడా అలాగే జరుగు తుందని, దాన్ని సభలో గట్టిగా వాడుకోవచ్చని తెలుగుదేశం పార్టీ భావించి ఉండచ్చు. నోటీసును ఆమోదించి, చర్చకు తీసుకునే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి దాని మీద సభలో గట్టిగా నిలదీయడం, వెల్‌లోకి దూసుకెళ్లడం ద్వారా జాతి దృష్టిని ఆకర్షించవచ్చన్నది వాళ్ల వ్యూహం కావచ్చు. కానీ, పార్లమెంటరీ రాజకీయాలలో సుదీర్ఘ అను భవం ఉన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ తన పార్టీ నుంచి అందిన సంకేతాలను సులభంగా అందిపుచ్చుకుని నోటీసు అందిన వెంటనే హెడ్‌కౌంట్ చేయించారు. 50 మంది మద్ద తు ఉండటంతో తక్షణం దాన్ని ఆమోదించడమే కాక, రెండు రోజుల్లోనే చర్చకు కూడా సమయం కేటాయించేశారు.

ప్రశ్నో త్తరాల సమయాన్ని సైతం రద్దుచేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ అంశానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నా మన్న సంకేతాలు పంపారు. తెలుగుదేశం పార్టీ ఈ పరిణా మాన్ని ఊహించలేదు. అప్పటివరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కార్యక్రమాలన్నిం టినీ రద్దుచేసుకుని ఆపరేషన్ అవిశ్వాసం మొదలుపెట్టారు. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడైన యనమల రామ కృష్ణుడిని తక్షణం హస్తిన పయనం కావాల్సిందిగా చెప్పారు. నోటీసు ఇచ్చింది కేశినేని నాని కాబట్టి ఆయనకు ముందుగా మాట్లాడే అవకాశం వస్తుందని తెలిసినా, అంతకుముందు అనుభవం దృష్ట్యా తొలి అవకాశాన్ని గల్లా జయదేవ్‌కు అప్ప గించారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడిని మాట్లాడమని చెప్పారు. ఎంపీలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సు నిర్వ హిస్తూ.. ఏయే అంశాలు ప్రస్తావించాలో నిర్దేశించారు. మొత్తం 18 రకాల అంశాలు ప్రస్తావించాలని వ్యూహరచన చేశారు. 

లోక్‌సభలో ఉదయం నుంచి చర్చోపచర్చలు వాడివేడి గా కొనసాగాయి. వాటన్నింటినీ సుమిత్రా మహాజన్ చాలా ఓపిగ్గా వినాల్సి వచ్చింది. ఆ తర్వాత రాహుల్‌గాంధీ వంతు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాతి నుంచి 48 ఏళ్ల వయసున్న బ్రహ్మచారి రాహుల్ వాగ్ధాటి కొంచెం పెరిగినట్లే కనిపిస్తోంది. సభలో ఉన్నవాళ్లను చూపి స్తూ వాళ్ల పేర్లు ప్రస్తావిస్తూ అచ్చం మోదీ శైలిని అనుక రించేలా రాహుల్‌గాంధీ రకరకాల హావభావాలతో మాట్లా డారు. అంతవరకు అంతా బాగానే ఉన్నా, చివర్లో తాను శివుడిని పూజిస్తానని చెప్పడం.. ఆ తర్వాత నే రుగా ప్రధాని సీటు వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకోవడం, తిరిగి వచ్చి కూర్చున్న తర్వాత వెనుక వరుసలో ఉన్న సహచరులు ఆయ నను అభినందిస్తుంటే వాళ్లకు నవ్వుతూ కన్నుగీటడం లాంటి అంశాలు మాత్రం ఒక్కసారిగా కలకలం రేపాయి.

సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం ఉన్న 75 ఏళ్ల స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ అంశాలపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికి వరుసగా ఎనిమిదోసారి ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనేకమంది మహామహులను చూశారు. వాళ్ల ప్రసంగాలు విన్నారు. సభా సంప్రదాయాలన్నింటినీ ఔపోసన పట్టారు. అలాంటి అనుభవజ్ఞురాలైన స్పీకర్.. రాహుల్‌గాంధీ ప్రవ ర్తించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన తన కొడుకు లాంటి వాడు అంటూనే తనకూ పుత్రవాత్సల్యం, ప్రేమ ఉంటాయని చెబుతూనే సభా సంప్రదాయాలు పాటించా లని, కాస్త హుందాగా ఉండటం నేర్చుకోవాలని చురకలు పెట్టారు. కేవలం చెప్పదలచుకున్న విషయాలు చెప్పడమే కాకుండా హావభావాలు, ఇతర విషయాలలో కూడా పెద్ద రికం నేర్చుకోవాలన్న విషయం ఇప్పటికైనా రాహుల్ గాంధీకి అర్థమై ఉండాలి. తమకు గొప్ప నాయకుడు దొరికాడని సంబరపడుతున్న కాంగ్రెస్ వర్గాలు, 50 ఏళ్లకు దగ్గర పడు తున్న తమ బ్రహ్మచారి నాయకుడికి కాస్త శిక్షణ ఇప్పించే ఆలోచన కూడా చేస్తే మంచిది. లేకపోతే భవిష్యత్తులో మరి న్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
ఆకర్షించిన రామ్మోహన్ నాయుడు
తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్ ఎటూ ఇంతకు ముందు మాట్లాడిన వారే కాబట్టి.. ఆయనెలా మాట్లాడ తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి కొత్తగా మెరిసిన వ్యక్తి మా త్రం.. దివంగత ఎర్రన్నాయుడి కుమారుడైన కింజరాపు రామ్మోహన్ నాయుడు. తనకు దక్కిన పదినిమిషాల సమ యాన్ని నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకుని పార్టీ లో కొత్తరక్తం ఉరక లెత్తుతోందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. హిందీలో అంకెలతో సహా అనర్గళంగా చెబుతూ పదిసెకన్లు కూడా వృథా ప్రస్తావనలు ఏమీలేకుండా మాట్లాడటంతో పాటు, తనకు అదనంగా దక్కిన ఒక్క నిమిషాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకున్న తీరు స్పీకర్‌ను కూడా ఆకర్షించింది.

ఇప్పటివరకు కేవలం ఎర్రన్నాయుడి కుమారుడిగానే ఎక్కువ మందికి తెలిసిన రామ్మోహన్ నాయుడు.. ఇప్పుడు టీడీపీలో బాగా ఎదిగేందుకు అవకాశాలున్న కొత్త తరం నాయకుల్లో ఒకరని అందరూ అర్థం చేసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం అవుతోంది. కేవలం కొన్ని సమీకరణాల ఆధారంగా పదవులు దక్కించుకున్నవాళ్లు సభలో ఎలా నిలబడగలరన్న విషయం కూడా శుక్రవారం నాటి అవిశ్వాస తీర్మానం చివరలో బాగా తెలిసిపోయింది. 

కాంగ్రెస్‌కు మోదీ చురకలు
లాస్ట్.. బట్ నాట్ ద లీస్ట్ అంటారు. ప్రసంగంలో ఎక్కు వ అంశాలు ప్రస్తావించాల్సి వచ్చినపుడు ముఖ్యమైన అంశా న్ని చివర్లో పెట్టడం ద్వారా దానికి అదనపు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ మాట చెబుతారు. అలాగే పార్ల మెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చివరగా మాట్లాడి నా తన వాగ్ధాటి, వాక్చాతుర్యంతో సభ మొత్తాన్ని తనవైపు తిప్పుకొన్నారు. తన సహజసిద్ధమైన శైలిలో కాసేపు మంద్రం గా.. మరికాసేపు నెమ్మదిగా.. అంతలోనే ఉధృతంగా మాట్లాడుతూ భిన్న విభిన్న హావభావాలు ప్రదర్శిస్తూ తాను చెప్ప దలచుకున్న అంశాలన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు టక టకా చెప్పేశారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఆయన ప్రసంగానికి అడ్డు పడబోయిన కాంగ్రెస్ సభ్యుల విషయంలో కూడా ఆయన వేసిన చురకలు బాగానే తగిలాయి.

రాహుల్‌గాంధీ మీద విమర్శలు గుప్పిస్తున్న సమయంలో కొంతమంది సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పైకి లేచినపుడు ‘మీ వంతు కూడా వస్తుంది. అందరికీ సన్మానం ఉంటుంది. ఎవరినీ వదిలేది లేదు.. తొందర పడద్దు’ అని చెప్పడం ద్వారా తన ఉద్దేశం ఏంటో స్పష్టం చేశారు. 2024లో కూడా తన ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం కావాలంటూ, 2019 ఎన్నికలలోనే కాదు, మరోసారి కూడా తనను ఓడించడం మీవల్ల కాదన్న ఆత్మ విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. మరో రెండుసార్లు కూడా తానే ప్రధానమంత్రిని అవుతానంటూ పార్టీలో అప్పుడ ప్పుడు వినిపించే అసమ్మతి గళాలను కూడా అణిచేసే ప్రయత్నం చేశారు.

దేశభక్తి సెంటిమెంటును బాగా ఉపయోగించుకున్న మోదీ.. సర్జికల్ స్ట్రైక్స్‌ను అనుమానించడం ద్వారా దేశం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులను అవమానిస్తారా అని కాంగ్రెస్ పార్టీమీద ఒంటికాలిపై లేచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నా యుడు, చంద్రశేఖర్రావుల పేర్లను ప్రస్తావిస్తూ.. వాళ్లిద్దరి మధ్య కీచులాటలకు తాను మధ్యవర్తిగా ఉండాల్సి వచ్చేదన్నారు. తర్వాత టీఆర్‌ఎస్ కాస్త పరణితి కనబర్చి, అభివృద్ధి మీద దృష్టి సారించడం ద్వారా ముందడుగు వేస్తే, టీడీపీ మాత్రం వైఎస్‌ఆర్‌సీపీలో ఉచ్చులో పడి విలవిల్లాడుతోందని స్పష్టం చేశారు. ఇలా ఒకరకంగా తెలంగాణ నాయకుల మనసు ఆయన గెలుచుకున్నారు. 

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడే అది నెగ్గదని, ప్రభుత్వాన్ని పడగొట్టలేమని ప్రతిపక్ష నాయకులందరికీ తెలు సు. కానీ, ఆ సందర్భంగా విస్తృత చర్చలు సాగించేందుకు అవకాశం ఉంటుందని, తమ సమస్యలను జాతి దృష్టికి తీసుకెళ్లొచ్చని మాత్రమే వాళ్లంతా కలిసి మరీ తీర్మానాన్ని ముందుకు తెచ్చారు.

అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో సోనియాగాంధీ లాంటి నాయకులు కూడా ‘మాకు బలం లేదని ఎవరన్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రధా ని మోదీ సమర్థంగా వాడుకోగలిగారు. ఆత్మవిశ్వాసం మంచి దే గానీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ చేటేనన్న విషయాన్ని మాత్రం నాయకులు గుర్తుంచుకోవాలన్న పాఠా న్ని ఈ అవిశ్వాస తీర్మానం మరోసారి నేర్పించింది. ఈ పాఠాన్ని గుణపాఠంగా తీసుకుంటే కొంతలో కొంతయినా మేలు చేకూరుతుంది. లేకపోతే వరుసగా పరాభవాలు ఎదుర్కోవాల్సిందే. 
chandrashekhara sharma

English Title
The speaker is the graeat




Related News