భారత ఫుట్‌బాల్ జట్టులో సౌమ్య

Updated By ManamTue, 10/23/2018 - 03:45
Soumya

imageహైదరాబాద్: తెలంగాణ యువ ఫుట్‌బాల్ క్రీడాకారిణి జి. సౌమ్య భారత జాతీయ జట్టులో చోటు సంపాదించింది. ఈ నెల 22 నుంచి 28 వరకు థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19  ఏఎఫ్‌సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీలో భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు పాల్గొంటుంది. అయితే భారత జట్టులో సౌమ్యకు చోటు లభించిన విషయాన్ని (ఏఐఎఫ్‌ఎఫ్) ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెళ్లడించిందని సోవువారం తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం తెలిపింది.  జాతీయ జట్టులో సౌమ్యకు చోటు దక్కడంపై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం హర్షం వ్యక్తం చేసింది.  బుధవారం జరిగే తన తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. 

English Title
Soumya in the Indian football team
Related News