కలిగిన అసౌకర్యానికి క్షమించండి

Updated By ManamThu, 05/17/2018 - 17:02
japan, raliway, tokyo

japan, raliway, tokyoటోక్యో:రైల్వే శాఖ  సమయం కంటే ముందే రైలు వెళ్లిందని ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. సమయపాలన కఠినంగా ఉండే జపాన్‌లో ఓ రైలు బయలుదేరే సమయం కంటే 25 సెకన్ల ముందే వెళ్లిపోయింది. దీంతో ఓ ప్రయాణికుడు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుకు స్పందించిన రైల్వే శాఖ.. రైలు సమయానికంటే 25 సెకన్ల ముందుగా  వెళ్లి ప్రయాణికులకు కలిగించిన అసౌకర్యానికి మన్నించాలంటూ  క్షమాపణలు చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే గత శుక్రవారం ఉదయం జపాన్‌లోని నోటోగోవా స్టేషన్‌ నుంచి ఓ రైలు బయలేదేరింది. షెడ్యూల్‌ ప్రకారం ఆ రైలు ఉదయం 7.12 గంటలకు వెళ్లాలి. కానీ, ప్లాట్‌ఫాం వద్ద ప్రయాణికులు కన్పించకపోవడంతో టైం అయిపోయిందని భావించిన డ్రైవరు 7 గంటల 11 నిమిషాల 35 సెకన్లకు స్టేషన్‌ నుంచి వెళ్లిపోయాడు. అయితే 25 సెకన్లు ముందే వెళ్లిపోవడం వల్ల ఓ ప్రయాణికుడు రైలు మిస్సయ్యాడు. దీంతో అతడు స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌కు ఫిర్యాదు చేయడంతో ఇది కాస్తా ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. వెంటనే స్పందించిన వెస్ట్‌ జపాన్‌ రైల్వే కంపెనీ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే జపాన్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు.. గత ఏడాది నవంబరులోనూ ఓ రైలు 20 సెకన్ల ముందే వెళ్లిపోతే.. అప్పుడు కూడా రైల్వేశాఖ క్షమాపణలు చెప్పింది. 

English Title
sorry plz excusme..railway
Related News