పాటల్లో పంతం

Updated By ManamSat, 05/26/2018 - 23:18
gopichand

imageగోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రం ‘పంతం’. మెహరీన్ హీరోయిన్.  కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రా న్ని నిర్మిస్తున్నారు. ‘ఫర్ ఎ కాజ్’ ఉపశీర్షిక. జూలై 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విదేశాల్లో పాటల చ్రితీకరణను జరుపుకోనుంది. ఈ నెల 29 నుండి లండన్, స్కాట్‌లాండ్‌లలో మూడు పాటలను చిత్రీకరించనున్నారు. మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్నారని.. గోపీచంద్ సరికొత్త పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ తెలియజేస్తోంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. 

English Title
The song in the songs
Related News