చెరకు రైతుల బాకీ తీర్చండి

Updated By ManamThu, 07/12/2018 - 01:23
harish rao
  • చక్కెర కర్మాగార యజమానులకు మంత్రుల ఆదేశం

  • ఈ నెల 25 కోట్లు, వచ్చే నెలలో 32 కోట్లు చెల్లించండి

  • చెరకు రైతు సమస్యలపై హరీశ్‌రావు, కేటీఆర్ సమీక్ష

harishraoహైదరాబాద్: చెరకు రైతుల బకాయిలను వెంటనే చెల్లిం చాలని చక్కెర కర్మాగారాల యాజమాన్యాలను  మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ జిల్లా పరిధిలోని చెరకు రైతుసమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు బుధవారం సచివాల యంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలపైనే సమీక్ష లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో అధి కారులతో పాటు, చెరకు కర్మాగారాల యజ మానులు పాల్గొన్నారు. చెరకు రైతులకు చెల్లిం చాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఇరు వురు మంత్రులు చెరకు ఫ్యాక్టరీ యాజమా న్యాలను ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల 59 వేల మెట్రిక్ టన్నుల చెరకును ఈ ఫ్యాక్టరీలు వినియోగించాయని, రైతులకు రూ.57 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు మంత్రుల దష్టికి తెచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. దీనిపై స్పందించిన మంత్రులు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు.  ఈ నెలలో 25 కోట్లు, వచ్చె నెలలో 32 కోట్లు రెండు విడతలుగా చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు అన్ని వసతులు సమకూరుస్తుంటే, కొందరు ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరి స్తున్నారని, ఇది తగదని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం  ఏదైనా ఉంటే తాము అందిస్తామని, రైతులను ఇబ్బంది పెట్టోద్దని చెరకు ఫ్యాక్టరీ యజ మానులకు మంత్రులు సూచించారు.

English Title
Solve the sugarcane farmers' debt




Related News