సామాజిక ‘న్యాయ’ శిఖరం

Updated By ManamFri, 08/10/2018 - 01:31
mathanam

image‘పి.శివశంకర్ ప్రధానమంత్రి తర్వాత దేశంలో అత్యం త శక్తిమంతవైున వ్యక్తి’ 1986 నాటికి ఇండియా టు డే ప త్రిక రాసిన కథనం ఇది. ‘కొందరు ఏమి ఆశించకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొందరు ఇతరుల చేసిన పనిని తమ ఖాతాలో వేసుకుంటారు. ఆ కృ షి ఫలితాన్ని అనుభవిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. 

పై వ్యాఖ్యలో మొదటి తరగతికి చెందుతారు మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్. 1929 ఆగస్టుimage 10న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో పేద మున్నూరుకాపు కుటుంబంలో 11 మంది సంతానంలో రెం డోవాడిగా పుట్టిన శివశంకర్ మెట్రిక్యులేషన్ వరకు హైదరా బాద్‌లో చదివి ఆ తర్వాత చదువుకు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడడంతో అన్నతో కలిసి ఇంట్లో నుండి పంజాబ్‌కి పారి పోయి చెప్పులు కుడుతూ, బూట్లు పాలిష్ చేస్తూ, కూలి పనులు చేస్తూ తిండి కరువైనప్పుడు మజ్జిగ తాగుతూ పల్లీలు తింటూ చదువుకుంటూ అమృత్‌సర్ హిందూ కాలేజీ నుంచి బీ.ఏ.పూర్తి చేశారు. అన్నదమ్ములిద్దరూ రైల్వేస్టేషన్ లో ఆశ్రయం తీసుకునేవారు. తిండి లేక ఆకలి బాధకి శివ శంకర్ అన్న అమృత్‌సర్‌లోనే చనిపోతే సోదరుని శవాన్ని ఇంటికి తీసుకవచ్చే కనీసం దహనం చేసే స్తోమత లేకపో వడంతో మున్సిపాలిటీ వాళ్లకే శవాన్ని విడిచిపెట్టాల్సిన విషా ద పరిస్థితుల మధ్య శివశంకర్ చదువు కొనసాగింది. అటు వంటి కఠోరమైన పరిస్థితుల్ని పేదరికాన్ని ఎదుర్కొన్నారు శివశంకర్. తన జీవితాంతం ఇంట్లోని దేవుని పూజ గదిలో అన్న ఫోటో పెట్టి ఉంచేవాడు. ఆ తర్వాత హైదరాబాద్ చేరి చిన్నచిన్న పనులు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బీ.ని 1952లో పూర్తిచేసిండు. అప్పటి హైదరాబాద్ మేయర్‌కి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసిండు.

న్యాయశాస్త్రాల్లో, ఇంగ్లీష్ భాషలో మంచి పట్టున్న శివ శంకర్ హైదరాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసుని ప్రారం భించి పేదల బడుగు బలహీన వర్గాల కేసులని ఉచితంగా  వాదించేవాడు. మంచి సమర్థుడైన న్యాయవాదిగా పేరు తె చ్చుకొని సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిండు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిండు. 1974 నాటికి చిన్న వయసు లోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జిస్థాయికి ఎదిగిండు. తను హైకోర్టులో పని చేస్తున్నప్పుడు భావ జాలంతో సంబంధం లేకుండా జస్టీస్ బీఎస్‌ఏ స్వామి, బొజ్జ తారకం లాంటి సామాజిక స్పృహ కలిగిన వాల్ల్లందరినీ ప్రోత్సహించిండు. ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయవ్యవస్థలో ఒకే కులానికి చెందినవా రు ఆధిపత్యం వహిస్తూ సీనియారిటి ప్యానల్‌లో మిగతా వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనించి తను  ప్ర భుత్వ న్యాయమూర్తి పరిధిలో పేదల బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేయలేకపోతున్నానని ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసిండు. చదువుకోవడమంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడము సమాజాన్ని పట్టించుకో కుండా వ్యక్తిగత ఎదుగుదలే ముఖ్యంగా భావించే నేటి తరా నికి సమాజం కోసం హైకోర్ట్ జడ్జి స్థాయి ఉద్యోగాన్ని వదులుకోవడంలో ఆయనలోని సామాజిక స్పృహ, ఆకాశ మంతటి ఆత్మవిశ్వాసం, దృఢమైన పట్టుదలని తెలియ జేస్తుంది. దేశంలోనే మొదటి సంఘటన ఇది. హైకోర్ట్ జడ్జిగా రాజీనామా చేసి హైకోర్ట్ సుప్రీం కోర్టులల్లో న్యాయ వాదిగా ప్రాక్టీసు చేస్తూ అన్ని వర్గాలకి సామాజిక న్యాయం విషయములో అధ్యయనం చేస్తుండేవాడు.

దేశంలోనే ప్రతిభావంతుడైన న్యాయవాదిగా ఎదిగిన శివశంకర్‌ని మా జీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో తన ప్రత్యేక న్యాయవాదిగా నియమించుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక కేసులని, కమిషనులని సమర్థవంతంగా డీల్ చేసిండు. 1979లో మొరార్జీ దేశాయి ఇందిరాగాంధీల మధ్య యుద్ధముల ప్రతిష్టాత్మకంగా భావించబడిన సికింద్రా బాద్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో శివశంకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలవడం అప్పట్లో రాజకీయ సంచలనం. తిరిగి 1980లో అదే స్థానం నుంచి గెలిచి, ఇందిర ప్రభుత్వంలో  న్యాయశాఖ మంత్రిగా పనిచేసి భారత న్యాయవ్యవస్థలో విప్లవకరమైన మార్పులు తీసుకొచ్చిండు. రిజర్వేషన్స్ లేని భారత న్యాయవ్యవస్థలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం, ఆ ధిపత్యం చెలాయిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్‌కి కనీస ప్రవేశం లేకుండా చేస్తున్నారని భావించి ఒక రాష్ట్రంలోని 30% హైకోర్ట్ సీనియర్ న్యాయమూర్తులు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోవాలని, అందుకు మూడు ఆప్షన్స్ ఇవ్వాలని మార్చ్ 18, 1981న న్యాయశాఖ మంత్రిగా భారత ప్రధాన న్యాయ మూర్తి వై.వీ.చంద్రచూడ్‌ని సంప్రదించకుండానే అన్ని రా ష్ట్రాల గవర్నర్‌లకి ముఖ్యమంత్రులకి న్యాయమూర్తులు ఇత ర రాష్ట్రాలకి బదిలీపై పోయే విషయంలో ఒక సర్క్యులర్ జా రీచేసిండు.

దేశచరిత్రలో బ్రాహ్మణ అగ్రవర్ణ కబంధ హస్తా లలో చిక్కిపోయిన దేశ న్యాయవ్యవస్థను కూకటి వేళ్ళతో పట్టి కుదిపివేసిన సంఘటన ఇది. న్యాయవ్యవస్థలో బ్రాహ్మ ణ, కొన్ని అగ్రవర్ణాల కుల, మత, ప్రాంత గుత్తాధిపత్యాన్ని తొలగించడమే ఈ చర్య ఉద్ధేశ్యం. న్యాయమూర్తులని అలా బదిలీ చేయడం వల్ల ఈ దేశ సమగ్రతకి తోడ్పడుతుందని బంధువులు కుల మత ప్రాంత సంకుచిత ధోరణులకి అతీ తంగా న్యాయవ్యవస్థ పనిచేస్తుందని ఆ సర్క్యులర్‌లో పేర్కొ న్నారు. కొత్తగా బదిలి అయిపోయిన రాష్ట్రంలో న్యాయమూ ర్తులకి వారు పుట్టిన రాష్ట్రంలోని వారి ఆధిపత్య కుల మూ లాలు వేరొక రాష్ట్రంలోని మూలాలకి తేడా ఉంటుందనీ కు లం భాష ప్రాంత తేడాలుండడం వల్ల ఆయా రాష్ట్రాలలో ఒకే కుల గుత్తాధిపత్యంని నిలిపివేసి అందరికి సమాన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని భావించిండు. ఆ సర్కులర్‌లో ఎస్సీ ఎస్టీలు సహా ఇతర వెనుకబడిన బలహీన వర్గాలను అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి పదవులలో నియమించడానికి ప్రత్యేకకృషి జరగాలని ఉత్తర్వులు జారి చేసిండు. ఆ సర్క్యులర్ న్యాయవ్యవస్థలో దుమారం లేపింది. న్యాయశాస్త్రంలో ఉన్న అపారప్రజ్ఞ, సామాజిక న్యా యం అమలు పట్ల ఆయనకుండే ధృడ సంకల్పమే న్యాయ వ్యవస్థతో పెట్టుకోవాలంటే భయపడే మహామహుల కంటే అతనిని ముందడుగు వేయించింది. మధ్య డిసెంబర్ 30, 1981న సుప్రీంకోర్ట్ ఎస్.పి.గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మా సనం ‘ఈ సర్క్యులర్‌కి న్యాయపరమైన బలం లేనందున రాజ్యాం గబద్ధం కాదు అని కూడా అనలేమని’ వాఖ్యానించింది.

ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు గ్రాన్వీల్ ఆస్టిన్ తన గ్రంథంలో ఈ సర్క్యులర్ విషయం లో ఇలా అంటాడు ‘శివశంకర్ దృష్టిలో జడ్జీలు  మేధావులు అందరూ బ్రాహ్మణ లేదా అగ్రవర్ణాల నుండి వస్తున్నవారే. న్యాయవ్యవస్థలో వారి ఏకస్వామ్యాన్ని బద్దలు కొట్టి వెనుక బడిన తరగతులైన ఓబీసీలు, ఎస్సీ ఎస్టీలు అడ్వకేటుల నుంచి బెంచ్ స్థాయికి చేరాలే. హైకోర్ట్‌ల చీఫ్ జస్టీస్‌లు న్యా యవ్యవస్థలో ఉద్యోగులని నింపడంలో, కేసులు నిర్ణయిం చడంలో కులానికి ప్రాధాన్యమిస్తున్నారు. బయటి నుండి జడ్జీలు రావడం వల్ల వాళ్ళకి కులపరమైన స్థానిక వేర్లు అందుబాటులోకి వచ్చే అవకాశముండదు. ఈ చర్య వల్ల తెలుగు వాడైన జస్టీస్ రామస్వామి దేశంలోనే తొలి దళిత సుప్రీంకోర్ట్ జస్టీస్ కాగలిగిండు. జస్టిస్ రామస్వామి విష యాన్ని శివశంకర్ వ్యక్తిగతంగా తీసుకొని విజయం సాధిం చిండు. ఆ తర్వాత కాలంలో న్యాయవ్యవస్థలో అంత బల మైన మద్దతుదారు ప్రభుత్వం తరపున లేనప్పటికి శివశం కర్ నైతిక మద్దతుతో  2007 నాటికి ఎస్సీ వర్గం నుండి న లుగురు, బీసీ వర్గం నుండి ఒకరు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులుగా చేశారు. 1987లో శివశంకర్ చేసిన సుప్రీంకోర్ట్‌పై చేసిన వాఖ్యలు ‘సుప్రీం కోర్ట్ సంఘ వ్యతిరేక శక్తులకి, ఫెరా (ఊౌట్ఛజీజ ఉ్ఠఛిజ్చిజ్ఛ ్చఛీ ఖ్ఛజఠజ్చ్ట్చూటడ అఛ్టి) ఉల్లంఘనకారులకి, పెండ్లికూతుర్లను కాల్చి చంపే వారికి మొత్తంగా తప్పుడు చర్యలకి ఆశ్రయంగా మారిపో యిందనినడం ద్వారా దేశంలో గగ్గోలు పుట్టించారు. ఎస్పీ గుప్తా కేసు తరువాత న్యాయమూర్తుల బదిలీ ప్రక్రియ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాని ప్రకారం ప్రతి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే 1/3 మంది న్యాయమూర్తులు వేరే రాష్ట్రాల హైకోర్ట్‌లకు చెందిన వారై ఉండాలి. కొంత కాలం ఇది పూర్తి స్థాయిలో అమలు జరిగింది. కానీ ఆ తర్వాత ప్రస్తుతం  పూర్తిగా అమలు కావడం లేదు.

1982లో ఇంధన శాఖను సమర్థవంతంగా నిర్వ హిం చిండు. ఇంధన శాఖను నిర్వహించిన సమయంలో రాజ కీయ జోక్యం లేకుండా, పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజె న్సీ ల కేటాయింపులను క్రమబద్ధీకరించారు. మానవ వనరుల శాఖ మంత్రిగా కేంద్రీయ విద్యాలయాల విస్తరణకు కృషి చేశారు. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిన శివశంకర్ మెదక్ (గతంలో ఇందిరాగాంధీ గెలిచిన స్థానం) నుండి లోక్‌సభకు  పోటీచేసి స్వల్ప తేడాతో ఓడి పోవడం తో 1985 నుండి 1993 వరకు గుజరాత్ నుండి రాజ్యసభకి ఎన్నికై కేంద్ర వాణిజ్య మంత్రిగా 1985లో, 1986లో విదే శాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖని నిర్వహించిండు. పార్టీ లో సీనియర్లు, ప్రధానికి దగ్గరి వాళ్ళు మాత్రమే చేపట్టే ఈ మంత్రిత్వ శాఖని కొద్దికాలం చేసినా విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులు తీసుకవచ్చిండు. సైద్ధాంతిక విలువల ప్రాతిపదికన ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో దేశ ఆర్థికాభివృద్ధి కోణాన్ని చేర్చిన ఘనత శివశంకర్‌కే దక్కుతుంది. గల్ఫ్ దేశాలతో పెట్రోలీయం దిగుమతి మినహా ఇతర ఆర్థికాంశాల గురించి భారతదేశం దృష్టి సారించలేకపోవడాన్ని గమనించిన శివశంకర్ లక్షలాది మంది భారతీయుల దుస్థితిని దౌత్యవేత్తల దృష్టికి తీసుకొచ్చారు.

1986లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటుగా అదనంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఆయన వద్ద ఉండడంతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది. గల్ఫ్ దేశాలాలోని భారతీయుల సంక్షేమానికి ఆయన కృషిచేశారు. గల్ఫ్ దేశాలలో ప్రవా సులు తాము పొందిన అనుభవం, సంపాదనతో మాతృ భూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, స్వయం ఉపాధి కల్పనా దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అప్పట్లో రాష్ట్ర పరిశ్రమల మండలి ఆధ్వర్యంలో సలహా కేంద్రాన్ని ఏకంగా గల్ఫ్‌లో నెలకొల్పారు.   వయస్సులో 27 ఫిబ్రవరి 2017 న మరణించాడు. గొప్ప విజన్ కలిగి ఉండి అపారమైన ప్రజ్ఞ కలిగి పని విధానం తెలిసిన శివశంకర్  జీవితాంతం అత్యున్నత విలువలు పాటించిన మహానీయుడు. అతని స్వప్నమింకా మన ముందు మిగిలే ఉంది.

- ఇట్యాల వెంకటకిషన్ 
    9908198484
( నేడు శివశంకర్ జయంతి )

Tags
English Title
Social justice
Related News