నీలి రంగు బైకుపైనా.. వజ్రమంత వయ్యారం

Updated By ManamThu, 05/17/2018 - 15:49
So Much To Say This Diamond Studded Blue Edition Harley Davidson
So Much To Say This Diamond Studded Blue Edition Harley Davidson

ఆకాశంలోని నీలాన్నంతా చుట్టేసుకుని.. అక్కడక్కడా బంగారంతో అలంకరించుకుని.. మధ్యమధ్యలో వజ్రాలను పొదిగేసుకుని.. ‘ఆహా’ అనేలా చూపు పడితే తిప్పుకోలేనంతలా ఉంది కదూ ఈ బైక్! హార్లే డేవిడ్సన్ బ్లూ ఎడిషన్ బైక్ ఇది. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైకుల్లో ఒకటిగా నిలిచే హార్లే డేవిడ్సన్‌ను ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లు వస్తున్నా.. ఏ మోడల్‌కు ఆ మోడలే సాటే అనే రీతిలో ఉంటాయి హార్లే డేవిడ్సన్ బైకులు. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా ఈ బ్లూ ఎడిషన్‌ను తీసుకొచ్చింది హార్లే. అయితే, దీనికి ఓ ప్రత్యేకత ఉంది సుమా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైకు ఇది. వజ్రకచితమిది. సుమారు రూ.13.54 కోట్లు దీని ఖరీదు. స్విస్ వాచ్, ఆభరణాల తయారీ సంస్థ అయిన బుషరర్‌తో కలిసి 2500 గంటల పాటు కష్టపడి ఈ బైకుకు రూపకల్పన చేశారు. బాడీ నిర్మాణం, రంగు, ఫీచర్లు ఎక్కడా తీసిపోకుండా.. పోటీ సంస్థలకు దీటైన పోటీ పెట్టేలా దీనిని రూపొందించారు. దాని ఫీచర్లు.. ప్రత్యేకతలు ఇవిగో...

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్కుమనండి...

  • బాడీకి వేసిన పెయింటింగ్‌తో దీనిని సాఫ్టెయిల్‌గా పిలుస్తున్నారు. ‘రహస్య కోటింగ్ ప్రక్రియ’ ద్వారా వివిధ రంగులతో ఆరు కోటింగులు వేశారు. ట్యాంకు మీద ‘బ్లూఎడిషన్’పైన హార్లే డేవిడ్సన్ లోగో ఉంటుంది. దాదాపు 17 హై ఎండ్ గడియారాలను ఇందులో పొదిగింది బుషరర్. 
  • హెడ్‌ల్యాంప్, థ్రాటిల్ వాల్వ్స్, హాండ్ లీవర్స్, రిజర్వాయర్ క్యాప్ (పెట్రోల్ ట్యాంకు), ఫుట్ రెస్ట్ వంటి వాటిని బంగారంతో తయారుచేశారు. దాని సీటును మొత్తం చేత్తో స్విట్జర్లాండ్‌లోనే కుట్టించారు. 
  • దానికి అమర్చిన గడియారం పాడవకుండా ఉండేలా సిలికాన్ రింగులతో డాంపర్ వ్యవస్థ ద్వారా అమర్చారు. 
  • జూరిక్‌లో ఈ బ్లూ ఎడిషన్ వజ్ర కచిత హార్లే డేవిడ్సన్‌ను విడుదల చేశారు.
So Much To Say This Diamond Studded Blue Edition Harley Davidson

 

English Title
So Much To Say This Diamond Studded Blue Edition Harley Davidson
Related News