రాహుల్ పర్యటనలో మార్పులు

Updated By ManamThu, 10/18/2018 - 19:27
Small Changes in Rahul Gandhi Telangana Tour
Small Changes in Rahul Gandhi Telangana Tour

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 20న ఆయన నాందేడ్ నుంచి నేరుగా బైంసాకు రానున్నారు. అక్కడ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 వరకూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకూ కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

ఇక సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకూ చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి ఏడు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళతారు.

English Title
Small Changes in Rahul Gandhi Telangana Tour
Related News