సుఖమైన శృంగారానికి ఈ ఒక్కటి పాటిస్తే చాలు

Updated By ManamSun, 05/06/2018 - 14:59
Sleep key factor for Happy Sex Life

Sleep key factor for Happy Sex Lifeనేటి తరానిదంతా బిజీ బిజీ లైఫ్. చిన్న చిన్న సరదాలనూ వదిలేసేంత బిజీ లైఫ్ వారిది. ఆ బిజీ లైఫ్‌లో పడి జీవితంలో ముఖ్యమైన వాటిలో ఒకటైన ‘శృంగార’ జీవితాన్నీ చాలా మంది కష్టతరం చేసుకుంటున్నారు. ఆలూమగల మధ్య శారీరకంగా, మానిసకంగా బంధం మరింతగా దృఢపడాలంటే శృంగారమే మంచి వారధి అని ఇప్పటికే చాలా మంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. అయినప్పటికీ చాలా మంది తమ శృంగార జీవితాన్ని అంత సుఖంగా మలచుకోలేకపోతున్నారు. కారణం, బిజీ జీవితంలో పడిపోయి నిద్ర కూడా సరిగ్గా పోని వారు చాలా మందే ఉన్నారు. వాస్తవానికి జీవితంలో ఏ పనైనా చురుకుగా చేయడానికి నిద్ర చాలా ముఖ్యమంటున్నారు. అంతేకాదు, శృంగార జీవితం కూడా సుఖంగా సాగాలంటే నిద్రదే కీలకపాత్ర అని అంటున్నారు. కంటి నిండా నిద్రపోయే వారు 14 శాతం మెరుగైన సుఖమయ శృంగార జీవితాన్ని గడుపుతున్నట్టు అధ్యయనాల్లోనూ తేలింది. దానికీ కారణాలు లేకపోలేదు.. ఆ కారణాలు...

నిద్ర-హార్మోన్లు: నిద్రకు హార్మన్లకు అవినాభావ సంబంధం ఉంది. నిద్రలేమి ఎక్కువగా ఉంటే హార్మోన్ల సమతుల్యతపై పెను ప్రభావం పడుతుంది. దేహంలో హార్మోన్లు సరిగ్గా పనిచేయాలంటే నిద్ర కూడా మంచిగా ఉండాలి. బాగా నిద్రపోయిన వారిలో హార్మోన్లు విడుదలై కణాలు, కణజాలాలను బాగు చేసి వాటి వృద్ధికి దోహదపడుతుంది. నిద్ర లేమి వల్ల టెస్టోస్టెరోన్ హార్మోన్ స్థాయులు కూడా పడిపోతాయి. కాబట్టి ఆ హార్మోన్ స్థాయులు బాగా ఉంటే శృంగార జీవితంలోనూ ఆనందం పొందొచ్చు. దానికి మంచి మార్గం నిద్ర. 

నిద్ర-ఒత్తిడి: కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలూమగల మధ్య శృంగార జీవితాన్ని ఒత్తిడి కూడా దెబ్బతీస్తుంది. ఆ ఒత్తిడికి కారణాల్లో నిద్ర కూడా ఒకటి. నిద్ర లేకపోవడం, పని పెరిగిపోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి వల్ల శృంగారమంటే ఆసక్తి సన్నగిల్లుతుంది. ఒకవేళ ఆ ఒత్తిడిలో సెక్స్ చేసినా అది అంతా సంతృప్తి కలిగించదు కూడా. పరోక్షంగా ఒత్తిడి మానసికంగా, భావోద్వేగాల పరంగానూ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కలగలపుకొని తుదకు శృంగార జీవితంపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గాలి.. శృంగార జీవితం హాయిగా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలి. 

నిద్ర-సావధానం/శ్రద్ధ: ఆలూమగల మధ్య ఆనందంగా శృంగారం సాగాలంటే భాగస్వామిపై శ్రద్ధ/సావధానం చాలా కీలకం. అలా అయితేనే శృంగార జీవితం పండుతుంది. అలా భాగస్వామి గురించి అనునిత్యం ఆలోచిస్తే ఇరు హృదయాల్లోనూ ఓ సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. తద్వారా శృంగారాన్ని సుఖమయ జీవితంగా మలచుకునే వెసులుబాటు కలుగుతుంది. అలా తన భాగస్వామివైపు అటెంటివ్ (సావధానం)గా ఉండాలంటే నిద్ర చాలా కీలకం. నిద్ర లేక సావధానత కోల్పోతే శృంగారమనేది ఓ ‘డ్యూటీ’లాగా మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి హ్యాపీగా అన్నీ మరచి ఓ కునుకేస్తే మంచిది. 

శృంగార జీవితంలో నిద్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మనిషి రోజువారీ జీవితాన్ని నిద్ర ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఒక్క శృంగారం విషయంలోనే కాదు మనం తీసుకునే నిర్ణయాలు, చదువు, కెరీర్ ఇలా ప్రతి ఒక్క విషయాలపైనా నిద్ర ప్రభావం భారీగానే ఉంటుంది. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎంత బిజీ లైఫ్ అయినా సరే టైం ప్రకారం హాయిగా రెప్పవాలిస్తే దినచర్యలన్నీ సక్రమంగా సాగుతాయి. 

English Title
Sleep key factor for Happy Sex Life
Related News