లీకైన గ్యాస్.. ఆరుగురు మృత్యువాత

Updated By ManamThu, 07/12/2018 - 19:50
Six workers, Gas Leakage, Steel factory

Six workers, Gas Leakage, Steel factoryఅనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని జర్మనీకి చెందిన గెరుడౌ ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీకై ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఇద్దరిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి సమీపంలోని ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం ఫర్నేజ్‌ విభాగంలో గ్యాస్‌ లీకైంది. గ్యాస్ లీకేజీ వాసన పసిగట్టిన అందులోని కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే కార్మికుల్లో 8 మంది కార్మికులు మాత్రం గ్యాస్ వాసన పీల్చిన వెంటనే అస్వస్థతకు గురై పడిపోయారు. ఈ క్రమంలో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల్లో మనోజ్‌, రంగనాథ్‌, వాసిం‌, గంగాధర, లింగయ్య, గురవయ్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం (హోం మంత్రి) ఎన్ చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

English Title
Six workers killed after Gas Leakage from Steel factory
Related News