ప్రధాని సహా 1.5మిలియన్ల మంది డేటాబేస్ చోరీ

Updated By ManamSat, 07/21/2018 - 08:59
Hack

Hack సింగపూర్: సింగపూర్‌లో అతిపెద్ద సైబర్ దాడి జరిగింది. ప్రధాని లీ హెచ్సీన్ లూంగ్ సహా ప్రభుత్వం వద్ద ఉన్న 1.5 మిలియన్ల మంది హెల్త్ డేటా బేస్‌ను సైబర్ దొంగలు చోరీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇది పెద్ద సైబర్ దాడి అని ప్రభుత్వం పేర్కొంది. ఓ ప్రణాళిక ప్రకారం డేటాను తస్కరించారని, డేటా చోరీపై సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించిందని ప్రభుత్వం తెలిపింది. ఇది సాధారణ హ్యాకర్ల పనో, క్రిమినల్ గ్యాంగ్ పనో కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మే 2015 నుంచి ఈ ఏడాది జూలై వరకు ఆసుపత్రులను సందర్శించిన 1.5 మిలియన్ల మందికి చెందిన డేటాను హ్యాకర్లు చోరీ చేశారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన భద్రత కలిగిన దేశంపై ఈ దాడి జరగడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.

English Title
Singapore personal data hack hits 1.5m
Related News