రజనీ సరసన హీరోయిన్ ఖరారు

Updated By ManamThu, 07/19/2018 - 10:53
rajini
rajini, simran

యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓ చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి హీరోయిన్, విలన్ ఖరారు అయ్యారు. ఈ చిత్రంలో మొదటిసారి రజనీ సరసన సిమ్రాన్ నటించనుండగా.. నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ మొదటిసారిగా కోలీవుడ్‌కు పరిచయం అవ్వనున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Simran romance with Rajini for the first time
Related News