భిల్లుల సింహస్వప్నం

Updated By ManamFri, 09/21/2018 - 00:37
Simhaswamp of Bhils

imageమనదేశంలో తెల్లవాడి పాలన మొదైలెన నాటి నుండి కడదాకా రాజీలేకుండా ఎదిరించి పోరాడింది ఆదివాసీలే. ఆంగ్లేయుల వలస పాలన ముగిసేంత వరకు దేశంలో ఎక్కడో ఒకచోట ఆదివాసీలు తెల్లవాడి పైకి విల్లు సంధిస్తూనే ఉండేవారు. అలాంటి గొప్ప చరిత్రను విస్మరించిన ఆ మహత్తర పోరాటాలలో భిల్లు ల తిరుగుబాట్లను (1822-57, 1874-89) ప్రత్యేకించి గుర్తుతెచ్చుకోవాలి. నేడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్‌లలో విస్తరించి ఉన్న భి ల్లు, బిలార, బరేలా, మంకర్ తదితర తె గల ఆదివాసులను ‘భిల్లులు’ అని అం టారు.

1874-89లో భిల్లు తిరుగుబాటుకు నేతృత్వం వహించిన తాంతియా భీల్ పుట్టిం ది 1840 మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా imageజిల్లా నిమాడ్ ప్రాంతం. ఆ వీరయోధుని అసలు పేరు లుండారా. బ్రిటిష్ పాలనలో అటవీ సంపదపై హక్కులు కోల్పోయిన భిల్లులు సామంతులు, జమీందార్ల దోపిడి పీడనలకు, ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఈ దు ర్భర పరిస్థితుల్లో తాంతియా తన తల్లి సహా భిల్లు మహిళలపై అవమానాలను ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతిన బూనాడు. సంప్రదాయక విల్లంబు లు, కత్తి, డాలు వంటి ఆయుధాలతో బగదావి, తేవరుల అండదండలతో బ్రిటిష్ పాలకులపై తిరుగుబావుటా ఎగరేశాడు. తేవర్లు తోడుకావడంతో తాంతియా చెలరేగిపోయాడు.

ఒకేసారి ఐదారు శత్రుస్థావరాలపై దాడిచేసి, మెరుపువేగంతో దెబ్బతీసి తప్పించుకుపోయే ఎత్తుగడలతో నిమాడ్, మా ల్వా ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్లకు సింహస్వప్నవుయ్యాడు. తాంతియా ఎక్కువగా హోల్‌కర్ (ఇండోర్) రాజ్యాన్ని అజ్ఞాత ప్రదేశంగా ఎంచుకునేవాడు. సామంతులు, జమీందార్లు, భూస్వాములను దోచి పేదలకు పంచేవాడు. అతనికి పట్టుకోవడానికి తాంతియా బెటాలియన్‌ను నియమించారు. ఐనప్పటికీ 1878-85 మ ధ్య భిల్లుల తిరుగుబాటు ఉధృతంగా సాగింది. అనావుకుల నమ్మక ద్రోహంతో తాంతియాభిల్ 1889లో బ్రిటిష్ సైన్యానికి చిక్కాడు. ఆ  స్వా తంత్రవీరుడిని జబల్‌పూర్ జైల్లో బంధించి, విచారణ తతంగం నడిపి 1890 సెప్టెంబర్ 21న ఉరితీశారు. ‘ఇండియన్ రాబిన్‌ హుడ్’గా పేరొందిన తాంతియాభిల్‌ను మాడ్, నిమాడ్, మాల్వా ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజలు నేటికి ఆరాధిస్తారు. 

- గుమ్మడి లక్ష్మీనారాయణ
7989134271

English Title
Simhaswamp of Bhils
Related News