జ్యోతి సురేఖకు రజతం

Updated By ManamSat, 07/21/2018 - 22:47
surekha
  • కాంపౌండ్ విభాగంలో భారత మహిళలకు రెండో స్థానం

న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-4లో తెలుగు తేజం జ్యోతి సురేఖ రజత పతకం గెలిచింది. మహిళల కాంపౌండ్ టీమ్ imageఈవెంట్ ఫైనల్లో భారత త్రయం త్రిష దేబ్, ముస్కాన్ కైరర్, జ్యోతి సురేఖ ఒక్క పాయింట్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. శనివారం బెర్లిన్‌లో జరిగిన ఈ పోటీలో నాలుగు రౌండ్లలో ఫ్రాన్స్ టీమ్ సోఫీ డొడెమాంట్, అమీలీ సాన్సెనాట్, సాండ్రా హెర్వే 229-228 తేడాతో భారత జట్టుపై గెలిచింది. భారత జట్టు ఈ పోటీని బాగానే ఆరంభించింది.

తొలి రౌండ్‌లో 59-57తో ఆధిక్యంలో నిలిచింది. కానీ తర్వాత ఫ్రాన్స్ టీమ్ 116-116తో స్కోరును సమం చేసింది. తర్వాత మూడో రౌండ్‌లో భారత త్రయం తొలుత ఏడు తర్వాత ఆరు పాయింట్లు సాధించడంతో ఐదు పాయింట్ల ఆధిక్యంలో కొనసాగింది. అయితే చివరి, ఫైనల్ రౌండ్‌లో ఫ్రాన్స్ జట్టు ఏడు, ఎనిమిది పాయింట్లు సాధించింది. ఈ ఆధిక్యాన్ని భారత్ అందు కోలేకపోయింది. చివ రికి మూడో రౌండ్‌లో భారత్ 59-60తో నిలిచింది. దీంతో భారత త్రయం ఒక్క పాయింట్ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది.

English Title
silver to Jyothi Surekha
Related News