శ్వేతాబసు‌కు నిశ్చితార్థం.. 

Updated By ManamSun, 06/03/2018 - 14:01
Shweta Basu Prasad, engagement, filmmaker Rohit Mittal

Shweta Basu Prasad, engagement, filmmaker Rohit Mittalముంబై: ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ‘ఎ...క్కడా...’ అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అందాల తార శ్వేతాబసు ప్రసాద్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. సినీ కెరీర్‌లో శ్వేతాబసు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. కొంతకాలం తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇటీవల శ్వేతాబసుకు నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆమె కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్టు తాజాగా మీడియాకు వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను తాను వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పారు. ‘‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావనే తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి.

ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలకు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో నా ప్రేమను వ్యక్తం చేశాను. పుణెలో నా ప్రేమకు రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంట్లో వారూ మా పెళ్లికి అంగీకరించడంతో ఇటీవల మా ఇద్దరి నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమే. పెళ్లి వెంటనే చేసుకోవాలనే తొందర లేదు. మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటకి చెప్పుకోవడం ఇష్టం లేదు’’ అని చెప్పారు. ‘కొత్త బంగారు లోకం’ చిత్రం తరువాత ‘కళావర్‌ కింగ్’, ‘రైడ్‌’, ‘కాస్కో’ తదితర తెలుగు చిత్రాల్లో శ్వేతాబసు నటించారు. ప్రస్తుతం రానున్న వెబ్ సిరీస్ ‘గ్యాంగ్‌స్టర్స్’లో శ్వేత నటిస్తున్నారు.  
 

English Title
Shweta Basu Prasad engaged to filmmaker beau Rohit Mittal
Related News