అందరి చూపు.. ఇటువైపే 

Updated By ManamWed, 05/16/2018 - 01:51
check
  • తెలంగాణ దిశగా చూస్తున్న రాష్ట్రాలు.. ‘రైతుబంధు’ అమలు తీరుపై దృష్టి

  • ఎన్ని ఎకరాల భూమి.. ఎంత పెట్టుబడి.. బడ్జెట్ భారంపై ఆరా.. అమలు యోచన

  • త్వరలో పలు రాష్ట్రాల్లో అమలయ్యే చాన్స్.. ఏపీలో అమలుచేయాలని సీపీఐ డిమాండ్

checkతెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న ‘రైతు బంధు’ పథకంపై పలు రాష్ట్రాలు దృష్టి సారించాయి. తొలుత సీఎం కేసీ ఆర్ ఈ పథకాన్ని ప్రకటించినపుడు పెద్దగా పట్టిం చుకోని రాష్ట్రాలు కూడా.. ఇప్పుడు అమలు చేస్తున్న తీరు చూసి అబ్బురపడుతున్నాయి. మొత్తం ఎన్ని ఎకరాల మేర సాగు భూములున్నాయి.. వాటన్నింటికీ ఎకరాకు ఏడాదికి రూ.8 వేల చొప్పున ఇవ్వాలంటే ఎంత మేర నిధులు అవసరం అవుతాయి, వాటికి బడ్జెట్ కేటాయింపులు ఎలా చేస్తున్నారన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఈ పథకాన్ని తమవద్ద కూడా అమలుచేస్తే ఎలా ఉంటుందన్న ఆరాలు వస్తున్నా యి. రైతులను గు ర్తించడం ఎలా, భూ మి విస్తీర్ణాలు కచ్చి తంగా ఉన్నాయా లేదా.. వాటికి దేన్ని ఆధారంగా తీసు కుంటున్నారు.. పట్టాదార్ పాస్ పుస్త కాల వ్యవస్థ ఎలా ఉంది.. వీటన్నిం టినీ పరిశీలిస్తున్నారు. అయితే, ఇత ర రాష్ట్రాలకు, తెలంగాణకు ఈ విషయంలో ఒక తేడా ఉన్నది. ఇటీవలి కాలంలో తెలంగాణలో భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన జరిగింది. అందువల్ల వివాదాస్పద భూములు మినహా మిగిలినవాటన్నింటికీ సంబంధించిన రికార్డులన్నీ పక్కాగా ఉన్నాయి. దాంతో భూమి యజమానులు ఎవరన్న విషయాన్ని తేల్చడం పెద్ద కష్టం కాలేదు. అందువల్ల చెక్కులు సిద్ధం చేయడం, వాటితో పాటే కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించడం లాంటివన్నీ సులభం అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలా భూ రికార్డుల ప్రక్షాళన పూర్తిస్థాయిలో జరగలేదు. దాంతో అక్కడ ఏ ప్రాతిపదికన భూముల విస్తీర్ణాన్ని నిర్ణయించి, ఎంత మేర పెట్టుబడి ఇస్తారన్నది తేలడం లేదు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఈ పథకం గురించి ఆరా తీయడంతో పాటు దాన్ని తమ ప్రాంతంలో అమలు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పక్షాలైతే దీన్ని రాబోయే ఎన్నికలకు మంచి అస్త్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. రైతులకు ఇంతలా మేలు చేసే పథకాలు ఏవీ లేవని.. రుణమాఫీ లాంటి వాటిని కూడా సమర్థంగా అమలుచేయడం కష్టమని నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ రైతు నాయకుడు అన్నారు. రైతులు పంట వేయడానికి ముందుగానే వారి చేతికి కొంత పెట్టుబడి సొమ్ము అందించడం, పంట పండిన తర్వాత దాన్ని కొనుగోలు చేయడానికి సరైన వ్యవస్థ ఏర్పాటు చేయడం లాంటి విధానాలు గతంలో ఎన్నడూ లేవని.. ఇలాంటి వ్యవస్థలు పక్కాగా నిర్వహించడం వల్ల రైతుకు స్థిరమైన ఆదాయం లభించడం, తద్వారా సాగుపై మళ్లీ ఆసక్తి కలగడం లాంటివన్నీ సంభవిస్తాయని ఆయన చెప్పారు. గతంలో వ్యవసాయం దండుగ అనే అనుకునేవారని.. కానీ ఇప్పుడు దాన్ని పండుగ చేయడం బాగుందని వివరించారు. పలు రాష్ట్రాలలో ఈ పథకాన్ని అమలుచేయాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇప్పటికే అక్కడి అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీని.. రైతుబంధు తరహా పథకం అమలుచేయాలని డి మాండు చేశారు. రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల వైపు చూడటం, వాళ్లు సమయానికి తగినంత రుణం ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు తప్పనిసరి పరిస్థితులలో వెళ్లడం తప్పడం లేదని, ఈ పరిస్థితిని నివారించాలంటే పెట్టుబడి పథకాన్ని అమలుచేయాలని అన్నారు. 

ప్రతిపక్షాలకు కష్టమే
అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎలాగోలా బడ్జెట్ కేటాయింపులు చూసుకుని ఇలా పంట పెట్టుబడి అందించే పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తే మాత్రం తమకు క ష్టమేనని ఆయా రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లూ రైతులకు అవి చేస్తాం, ఇవి చేస్తామని హామీలు ఇవ్వడమే తప్ప సరైన సాయం అందించిన పాపాన పోలేదు. పంటల బీమా పథకం ఉన్నా దాన్ని కూడా ఇంతవరకు సరిగా అమలుచేయలేదు. బీమా అమలుకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలా, గ్రామాన్నా అనేది ప్రతిసారీ సమస్యే అవుతుంది. దానికితోడు ప్రకృతి విపత్తులు సంభవించినపుడు పంటనష్టం అంచనాలకు వెంటనే వెళ్లకుండా రెండు మూడు నెలల తర్వాత వెళ్లడంతో వాస్తవ నష్టం ఎంతనేది సరిగా తేలక రైతన్నకు అన్యాయమే జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పంటలు సాగు చేసుకోడానికి ముందుగానే పెట్టుబడి అందడం చిన్న విషయం కాదన్నది పలు రైతు సంఘాల అభిప్రాయం కూడా. 

Tags
English Title
Show everyone else
Related News