రావాల్సిందే!

Updated By ManamSat, 09/22/2018 - 03:44
babu
  • ఎవరినీ ప్రత్యేకంగా చూడం.. ధర్మాబాద్ కోర్టు స్పష్టీకరణ

  • కోర్టుకు హాజైరెన టీ-నేతలు.. ముగ్గురికి బెయిల్ మంజూరు

  • కేసు అక్టోబరు 15కు వాయిదా.. ఆ రోజు రావాలని ఆదేశం

  • నోటీసులు మాకు అందలేదు.. నాలుగు వారాల గడువివ్వండి

  • బాబు తరఫు న్యాయువాదులు.. తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు

babuధర్మాబాద్: బాబ్లీ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. చంద్రబాబు తరఫున రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యా యువాది కనకవేుడల రవీంద్రకుమార్ నేతృత్వంలోని న్యాయువాదుల బృందం ధర్మాబాద్‌కు వెళ్లి.. పిటిషన్ దాఖలు చేశారు. కానీ, దాన్ని తిరస్కరించిన కోర్టు.. చంద్రబాబు సహా ఈ కేసులో నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో చంద్రబాబు సహా మొత్తం 16 మందికి ధర్మాబాద్ కోర్టు వారంట్లు జారీచేసిన సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్ మాత్రం శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. వారు ముగ్గురికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరు కాకుండా.. తన తరఫున న్యాయువాదులను పంపి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సీఎం చంద్రబాబు తరఫున వాదించిన న్యాయువాదులు.. తమకు అసలు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. దాంతోపాటు, తమకు నాలుగు వారాల గడువు కావాలని కూడా కోరారు. కానీ.. కోర్టు మాత్రం తాము ఎవరినీ ప్రత్యేకంగా చూడబోమని.. ముఖ్యమంత్రి అయినా కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 15వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా నోటీసులు అందుకున్న వారంతా ఆ రోజు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.

English Title
Should come
Related News