టాలీవుడ్‌కు మరో కోలుకోలేని షాక్..!!

Updated By ManamThu, 07/12/2018 - 12:38
Shocking News: Mind Blowing Shock To Tollywood

Shocking News: Mind Blowing Shock To Tollywood

హైదరాబాద్: డ్రగ్స్ కేసుతో ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతున్న టాలీవుడ్‌కు తాజాగా మరో కోలుకోలేని షాక్ తగిలింది. ఎర్రచందనం అక్రమ రవాణా జూనియర్ ఆర్టిస్టులు, పలువురు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారని తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రకటించడం జరిగింది. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.  కాగా.. తాజాగా తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ మరోసారి కలకలం రేపింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో కోట్లకు పడగలెత్తిన ఓ స్మగ్లర్ ఆ డబ్బంతా సినిమాల్లో పెట్టుబడి పెట్టాడు. వివరాల్లోకెళితే.. టీవీ సీరియళ్లలో చిన్న క్యారెక్టర్లు చేస్తున్న ఈ స్మగ్లర్ ఇటీవల జబర్దస్త్ ఫేం షకలక శంకర్ హీరోగా నటించిన ‘శంభో శంకర’ మూవీకి భారీగా పెట్టుబడికూడా పెట్టినట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ వృత్తిగా.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రవృత్తిని ఎంచుకున్న ఇతడి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతికి చెందిన ఈ స్మగ్లర్ టీవీ ప్రోగ్రామ్స్, టీవీ సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేస్తుండేవాడు. ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంటూ ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. శేషాచలంలో ఎర్రచందనం దుంగలను నరికి ఇతర రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలోని పలువురి స్మగ్లర్లతో పరిచయం పెంచుకుని కోట్లకు పడగలెత్తినట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. స్మగ్లర్‌పై 20కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Shocking News: Mind Blowing Shock To Tollywood

దీంతో మరోసారి ఎర్రచందనం అక్రమరవాణాతో టాలీవుడ్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఈ అక్రమ రవాణాలో ఎంత మంది ఉన్నారు? అనే విషయం తెలియరాలేదు. కాగా వారి పేర్లను పోలీసులు కూడా బయటపెట్టడం లేదు. 2017 నుంచి కేసులు నమోదు చేయడం ప్రారంభించినట్లుగా మధు బాబు అనే పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు. గుడియాతం అనే ప్రాంతంలో తుపాకులను తయారుచేసి శేషాచలంలో ఎర్రచందనం దుంగల అక్రమరవాణాకు అడ్డొచ్చిన వారిపై ప్రయోగించడం.. ఎవరైనా ఎర్రచందనంను రవాణా చేస్తున్నా వారిని అడ్డుకుని హైజాక్ చేయడం ఇలా ఓ గ్యాంగ్ చేస్తోందని పోలీసు అధికారి చెబుతున్నారు. 2017లో పలువుర్ని అరెస్ట్ చేశామని.. కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేయగా..  చిత్రపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి దీన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నట్లుగా తేలింది. ఆయన ప్రధాన అనుచరులను అరెస్ట్ చేయగా కీలక సమాచారం తెలిసింది. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు కూడా ఈ వ్యవహారంతో లింకున్నాయని త్వరలో వారందరిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. త్వరలో ఆ ఆర్టిస్ట్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. ఆ ఆర్టిస్ట్‌ ఒక్కడ్ని పట్టుకుని అరెస్ట్ చేస్తే అతని వెనుకున్న ప్రముఖుల పేర్లు బయటపడతాయన్న మాట. వీలైనంత త్వరలో ఆ ఆర్టిస్ట్‌ను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Shocking News: Mind Blowing Shock To Tollywood
Related News