షా 60, పంత్ 62

Updated By ManamTue, 10/16/2018 - 05:49
Prithvi Shaw
  • కోహ్లీ టాప్‌లోనే

  • ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

virat-shawదుబాయ్: టీమిండియా యువ సంచలనాలు పృథ్వీషా, రిషబ్ పంత్‌లు మళ్లీ మెరిశారు. ఆటలోనే కాదు ర్యాంకుల్లోనూ తమదైన శైలిలో దూకుడు కనబరిచారు. ఐసీసీ తాజాగా సోమవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ పది స్థానాలకు పైగా ఎగబాకారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక హైదరాబాద్ టెస్టులో 70, 33 నాటౌట్‌తో నిలిచిన షా 13 స్థానాలకు ఎగబాకాడు. 60వ ర్యాంకు సాధించాడు. బంతుల్ని అలవోకగా బౌండరీకి తరలిస్తున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకాడు. పంత్ 62వ ర్యాంకులో నిలిచాడు. విండీస్ సిరీస్ ఆరంభానికి ముందు అతడిది 111వ ర్యాంకు కావడం గమనార్హం. రెండు టెస్టుల్లోనూ రిషబ్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఉప్పల్‌లో 80 పరుగులు చేసిన అజింక్య రహానె నాలుగు స్థానాలు మెరుగై 18వ ర్యాంకు సాధించాడు. పది వికెట్లతో చరిత్ర సృష్టించిన బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో నిలిచాడు.

English Title
Shaw 60, Pant 62
Related News