ఆ హీరోయిన్‌తో రెండో సారి..?

Updated By ManamTue, 06/05/2018 - 16:18
Sharwanand

Sharwanand, Sai Pallavi యంగ్ హీరో శర్వానంద్ మంచి జోరు మీద ఉన్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను ఒప్పుకుంటున్న ఈ హీరో తాజాగా ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ చిత్రంలో శర్వా సరసన నటించేందుకు సాయి పల్లవి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ కాంబోలో ప్రస్తుతం ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రం తెరకెక్కుతుండగా, అది విడుదల కాకముందే ఈ జోడి మరో చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేణు ఊడుగుల కథను సాయి పల్లవికి వినిపించడం, విన్న వెంటనే ఆమె భావోద్వేగానికి గురై ఒప్పుకోవడం జరిగిపోయిందన్న టాక్. అంతేకాదు ఈ చిత్రానికి విరాట పర్వం 1992 అనే టైటిల్‌ను కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

English Title
Sharwanand paird with Sai Pallavi second time..?
Related News