శరత్ హంతకుడిని మట్టుబెట్టిన అమెరికా పోలీసులు

Updated By ManamMon, 07/16/2018 - 10:29
sharath

sharath కెన్సాస్: అమెరికాలో ఈ నెల 4వ తేదిని ఓ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో అశువులు బాసిన వరంగల్ జిల్లా వాసి శరత్ హంతకుడిని అమెరికా పోలీసులు మట్టుబెట్టారు. కెన్సాస్ సిటీ శివార్లో ఆ హంతకుడి ప్రాంతాన్ని కనుగొన్న అమెరికా పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే లొంగిపోయేందుకు సిద్ధంగా లేని ఆ హంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఆయన మరణించాడు. ఈ విషయాన్ని కెన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని ఆయన వెల్లడించారు. 

English Title
Sharath Koppu Murderer killed, 3 officers wounded in Kansas encounter
Related News