నేడు నగరానికి శరత్ భౌతికకాయం

Updated By ManamThu, 07/12/2018 - 00:19
sarath
  • తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం.. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ

sarathహైదరాబాద్: అవెురికాలోని కన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించిన వరంగల్ వాసి శరత్ మృతదేహం గురువారం హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో నేరుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నట్లు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ విషయాన్ని తనకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఫోన్ చేసి చెప్పారని ఆయన తెలిపారు. శరత్ తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని అందించామని, వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని ఆయన  అన్నారు. హంతకున్ని త్వరలో పట్టుకునేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అమెరికా మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. కాగా, అవెురికాలోని మిస్సోరి వర్సిటీలో ఎంఎస్ చదువుతూ అక్కడి రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న శరత్ కొప్పు ఓ దొంగ జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. 

Tags
English Title
Sharat is the physics of the city today
Related News